Tuesday, March 30, 2021

పల్లెపాట

 సిన్ననాటి పల్లెబతుకు సితికిపాయెరా

పల్లెలన్ని ముల్లెసదిరి వలసవోయెరా


పచ్చనిపైరులనడుమ వెచ్చగ వొదిగిన ఊరు

పాడిపంట గొడ్డుగోద లమరి వెలిసినవూరు

కపటమెరుగని మనుషుల కంచుకోటవూరు

అభివృద్ధను పేరుతోటి ఆగమాయె జూడు


వాగులువంకలువొర్లి సెర్వులల్లమల్గవడితె

నిండుగర్భినోలె సెర్వు నిగనిగలాడేది ఉరు

ఆపలేక సెరువు అలుగుదుంకంగా

మత్తళ్లు దుంకంగ  మనసుపొంగేది


No comments: