Wednesday, March 17, 2021

నాన్న! (కైతికాలు)

  నడువలేని పసివాడికి

నాన్నశిరమాసన మాయె

నకనకలాడే యెండకు

పచ్చనాకు గొడుగాయె

నాన్నే నడిచే దేవుడు

తనకు సాటిలేరెవ్వరు -97


 పసియడుగులు కందకుండ

తనపాదపు తొడుగులేసె

పసివదనం కందకుండ

పచ్చనాకు గొడుగుజేసె

నాన్నంటే నడుపువాడు

అహర్నిశలు కాచువాడు -98


 ఘోరాటవి దాటింపగ

తేరయిమోస్తాడు నాన్న

ముంపుటేరు దాటింపగ

తెప్పయివస్తాడు నాన్న

నాన్నంటే బరువుగాదు

నాన్నంటే భరోసా -99


No comments: