నువ్వులేకనేను లేననుకున్నాను
నువ్వేలోకమని అనుకున్నాను
నాయెదదాటి తనువంతా నీవల్లితె
నాఉనికే శూన్యమని యెరుగకున్నాను. - 1
ఆడపిల్లను ఆదిలక్ష్మిగ భావించారు
ఆడపిల్లను అదృష్టదేవతగ భావించారు
అయినా అవని నలుమూలల యెందరో
ఆడపిల్లను అరిష్టముగా నిందించారు - 2
వసంతమై బతుకుబాటలొ పచ్చికపరుస్తావనుకున్నా
శరత్తువై జీవితాన వెన్నెలలు విరబూస్తావనుకున్నా
భీష్మించిన తాపముతో గ్రీష్మానివై క్రీడించి
శిశిరమై చిగురాశలు రాల్చుతావని యెంచకున్నా - 3
తనువే సత్యమని వలచితినేను
ధనమే నిత్యమని మురిసితినేను
ముదిమితో తనువు అలిసిన వేళ
అంతా మిథ్యయని తలచితినేను - 4
No comments:
Post a Comment