Thursday, August 30, 2018

దత్తపదులు

దత్తపది
అందమ-కందమ-చందమ-విందమ

అందమ పర భాష పదములు తెలుగున
కందమవియ నెరుగు గాక నేమి
చందమ దియును గల్గి సరసుల వీనుల
వింద మదియొ నర్చు వేడ్కతోడ

కం.

కందమ తెలుంగు పద్యపు
అందమ యినట్టి అలంక రంపగు సొంపున్
చందమ లంకార మగుచును
విందమ హృద్యమ్మ గుతెలుగు వీనుల విందై

బానిసత్వం నానీలు

రూపాయిలో సింహం
బందీ అయ్యింది
బానిసత్వం మరల
పురుడు వోసుకుంది


రూపాయికి సింహం
అతుక్కుపోయింది
మళ్లీ దొరతనం
వెల్లివిరిసింది!

రాజకీయం

కష్టకాలములోన
కారుదిగని ఖద్దరు
ముతకగుడ్డల జేరి
మురిసిపోతుంది !

పల్లెకే రాని
తెల్లగుడ్డలు నేడు
వృత్తులతో
ఫోజులిత్తున్నయి !

సాటి మనిషిని
సహించని నేతలు
పల్లె కంపుకు
పరవశిస్తున్నారు!

Wednesday, August 29, 2018

తెలుగు భాష -సీసం

(తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో)

సీసం:
మందార మకరంద మాధుర్యములతోడ
మధురస మొలకించు మాతృభాష
నిర్మల మందాకి నీవీచి కలదూగు
హాయిగొ ల్పెడునట్టి మధుర భాష
లలితరసాల పల్లవ లాలిత్య విలసిత
నవనీత కోమలి నాదు భాష
పూర్ణేందు చంద్రికా స్పురిత యైసాగు
జ్ఞానసు ధలుబంచు జనుల భాష


పలుతె రగుల దెలివి ప్రపుల్ల మొందేల
పదస మూహ మున్న పసిడిభాష
మనసులోని భావ మాధుర్య ములతోడ
జనుల రంజ కమయి జగతి వెలుగు

Sunday, August 26, 2018

పల్లె జీవనం

కులమతా లెరుగక కృషిజేయ చనెదరు
ఆటపా టలతోడి పనులు జేయ
జనులంత గూడుతు జతగట్టి సాగుతూ
సంఘటి తమయేరు సాగు జేయ
అంతర ములనన్ని మరిచిపో యుకలిసి
పంటపొ లమ్ములో పనులు జేతు
కులవృత్తి కాండ్రంత నెలమితో పనిజేసి
పసిడిపం టలకయి పాటు వడిరి

పాత కాలపు పనిముట్లు పక్క నెట్టి
ఆధు నికతకై సాగిరి యవని జనులు
జనులు కలిసిచే సుకునేటి పనుల మరిచి
యంత్ర సాగున సిరులను గాంచు తుండ్రు

మా వూరు



దినకరుని దివ్యకరములు
పుడమినంటక మునుపే
తలుపులు తెరిచే మా పల్లె
తరుణోదయ తప్తకాంతులు
తాకంగనే
హృదికమలాలై వెల్లివిరిసే
సుందర సరోవరం మాపల్లె
చిరుజల్లుల చిలిపి పనులకు
మురిసి విరిసిన అందాల హరివిల్లు మాపల్లె
మట్టిమనుషుల పరిమళాలు
వెదజల్లే అనురాగాల పొదరిల్లు మాపల్లె
సుందర శిల్పసౌందర్య విలసిత
కమనీయ కళాఖండం మావూరు

ప్రకృతి సోయగాల పరిమళ సౌరభం మావూరు
ఆకురాలిన తావుల్ల చిగురించే
చిగురుటాకు సింగారింపు మావూరు


కమలాలతో కళకళలాడుతూ
అలరారే

Sunday, August 19, 2018

కానకూన

పచ్చని ప్రకృతి ఒడిలో
పులకించె తనువు
పక్షుల కిలకిలతో
పరవశించే మనము
చెట్టుచేమలు నేస్తాలుగా
కొండాకోనలు బాంధవులుగా
గిలిగింతలు వెట్టే పిల్లతెమ్మెరలు
మైమరిపించే మలయమారుతములు
ప్రాకృతిక జీవన మొనరించు
కానకూన
అరవిరిసిన అరవిందం
ఆకుపచ్చని చంద్రబింబం
చెదరని చెంగావి దరహాసం
జిలుగులద్దుకున్న చెక్కుటద్దములు
కనులలోదాగిన కలువరేకులు
మచ్చెరుగని మనసుగలిగిన
కందెరుగని కోమలి
ఎవరీ సరసిజ నయనీ?
మన్నెంలో విరిసిన మొగిలి!
అడవితల్లి ఆత్మజ!!

అతి వ్యథలు

కం.
మితిమీ రినసం పదలవి
వెతలను గల్గించు టెగాక వేదన లొసగున్
అతిగా కురిసిన వానలు
బతుకులు చిద్రములొ నరించి బాధల నొసగున్

సమస్యాపూరణం

సమస్య.
కొండలను యలంకరించి కోమలి మురిసెన్


కం.
మెండుగ మనమున భక్తితొ
కొండల రాయుడి నిజేరి కొలుచుట కొరకున్
దండిగ పూలను జేకొని
కొండల కునలం కరించి కోమలి మురిసెన్

సమస్య.
కంటిదీపమౌ సుతుడయ్యె గాల యముడు

అంకు రించిన  దాదియ ల్లారు ముద్దు
పెంచు చుందురు వారలు పెరిమ తోడ
అట్టి తలిదండ్రు హింసించు నాస్తి కొరకు
కంటిదీప మౌ సుతుడయ్యె గాల యముడు

Thursday, August 16, 2018

గురుస్తుతి

తెలుగు ప్రముఖులుగా రాష్ట్రపతి ప్రశంసలందిన బేతవోలు గారిపై పద్యకుసుమం


సంస్కృతాంధ్ర భాష సారమ్ము లనెరిగి
పద్య రచన యందు ప్రతిభ జూపి
వెలుగె బేత వోలు తెలుగుతే జమమయ్యి
తెలుగు జాతి కీర్తి దిశలు చాట

Wednesday, August 15, 2018

త్యాగధనులు(పద్యాలు )

భరతజ నులనుభ వించెడు
పరతం త్రముబా పుటకును పౌరుష మొందన్
వరమగు కార్యము లువదిలి
పరులకొ రకుపో రుసలిపి ఫలమను బొందెన్

Tuesday, August 14, 2018

సమస్యాపూరణం

సమస్య
చెలియలు జలపు ష్పముగని చెంగున బెదిరెన్

జలజ మ్ములువిరి నసిదై
చెలువా రెడుజల మునుగల చెరువున్ జేరీ
వలువలు గట్టున పెట్టిన
చెలియలు జలపు ష్పముగని చెంగున బెదిరెన్

Saturday, August 11, 2018

హరుడు

జలము వోసి నంత పులకించి పోవును
పత్రి వెట్టి నంత ఫలము లొసగు
విమల మతినొ సంగు వీబూది ధరియింప
హరి వంటి దైవ మవని గలదె?

[8/11, 8:45 PM] Rajashekar Pachimatla: గంగ తలదాల్చి గర్వమిం చుకలేక
కాల నాగు దాల్చు కంఠ మందు
పులి తోలు దాల్చు పులకించు
పాప సంహ రుండు పాల నేత్రు

గంగ తల దాల్చి గర్వమిం చుకలేక
జగతి జనుల కంత జలము బంచె
కంఠ మందు  గరళమ్ము దాల్చినా
సురల కంత  మధుర సుధలు వంచె

హంగు లార్భ టమ్ము లస్సలే లేకుండ
సాధు జీవ నమ్ము సాగు చుండ
నిలువు టద్ద మయ్యె నిరడంబ రతకుతా
పాప సంహ రుండు ఫాల నేత్రు

[8/12, 11:47 AM] Rajashekar Pachimatla: గంగ తల దాల్చి గర్వమిం చుకలేక
జగతి జనుల కంత జలము బంచె
కంఠ మలరి యున్న  గరళమ్ము నెంచక
సురల కంత  మధుర సుధలు వంచె

[8/12, 11:48 AM] Rajashekar Pachimatla: జలము వోసి నంత పులకించి పోవును
పత్రి వెట్టి నంత ఫలము లొసగు
విమల మతినొ సంగు వీబూది ధరియింప
హరుని వంటి దైవ మవని గలదె?

సమస్యాపూరణం:

సమస్యాపూరణం:
జలపు ష్పములగ నినంత జలజభ యపడెన్

కం.చెలికా నిచేయు బట్టుక
      వలపుల క్రీడల కుచెలియ వడివడి కదులన్
      జలము న్నచెరువు నందలి
      జలపు ష్పములగ నినంత జలజభ యపడెన్

పంది యిష్టపడును పద్యములను

అందమైన తెలుగు పద్యమరచిచూడ
సుంద రంపు భావ సుస్థిరమ్ము
తెలుగు భాష సొగసు తెలుసుకొ నగనెంచి
పంది యిష్టపడును పద్యములను

Wednesday, August 8, 2018

గజల్ స్నేహపరిమళం



అందమైన బంధమై అవతరించెరా చెలిమి
అవరోధాలెరుగకుండ అంకురించురా చెలిమి ॥2॥

పేద ధనిక భేదాలను యెంచబోదురా ॥2॥
సిరిసంపద తూచనిదీ స్వచ్ఛమైన చెలిమిరా

కులమతాలపట్టింపుల నెలవుగానిదీ॥2॥
మంచిమనసుతో మనుషుల గెలుచు చెలిమిరా

కలిమి బలిమి లవి
చెలిమిని నిలువరించవూ॥2॥
రంగురూపుచూడని యనురాగమే చెలిమిరా

సకల సంపదలు మించు స్వర్గమే స్నేహమనీ
కవిశేఖరు కలలుగన్న బలము చెలిమి రా

Monday, August 6, 2018

గజల్ స్నేహపరిమళం

గజల్   స్నేహపరిమళం

అందమైన బంధమై అవతరించెరా చెలిమి
అంంతస్తులనెరుగకుండ అంకురించురా చెలిమి ॥2॥

పేద ధనిక భేదాలను యెంచబోదురా ॥2॥
సిరిసంపద తూచనిదీ స్వచ్ఛమైన చెలిమిరా

కులమతాలపట్టింపుల నెలవుగానిదీ॥2॥
మంచిమనసుతో జగతిని గెలుచు చెలిమిరా

కలిమి బలిమి లవి
చెలిమిని నిలువరించవూ
రంగురూపు లవి చెలిమికి రక్తినీయవూ ॥2॥
సకల సంపదలు మించు స్వర్గమే స్నేహమనీ
కవిశేఖరు గుర్తించిన బలము చెలిమి రా 



Sunday, August 5, 2018

చెలిమి ఫలం

దుష్ట మైత్రి వలన దుర్గతు లుకలుగు
మైత్రి తోడ మంచి  బతుకు దొరుకు
కౌరవులను గూడి కర్ణుడు చెడిపోయె
అర్జునుండు వెలిగె అచ్యు తునితొ
పచ్చిమట్లమాట పసిడిమూట

Saturday, August 4, 2018

కార్యానుకూలత

అనుకూ లతలే నియెడల
పనుల న్నిటగా నరాదు ఫలితం   బవనీ
అనుకూ లతగలి గినెడల
పనుల న్నియుస క్కజేసి పరవశ మొందన్

బాటసారి

అడుగడుగులు కదిలి పథము సాగుటెగాని
బడలి కెరుగ బోడు బాటసారి
ఎగుడు దిగుడు త్రోవ లెన్నెదు రైనను
జంక కుండ సాగి జయము నొందు

                పచ్చిమట్ల రాజశేఖర్

Friday, August 3, 2018

హరితహారం


దండిగ తరువులు బెంచిన
మెండుగ వానలు కురియును మేదిని యందున్
నిండును చెరువులు కుంటలు
పండును తెలగా ణనేల బంగరు పంటల్

తెలంగాణ అభ్యుదయ గేయం

 పల్లవి:
జై జై తెలగణ స్వాతంత్ర్యాభ్యుద
                యానందోత్సవ శుభ సమయం
ప్రియతమ తెలగణ జనయిత్రీ చిర
                 దాస్య విమోచన నవోదయం  ॥2॥
 1చరణం:
పొద్దుపొడిచె లేవండోయీ
నిద్రవిడిచి రారండోయీ ॥2॥
బంగరుభవితకు బాటలు వేయుచు
జాతిని జాగృత పరచాలోయీ   ॥జై జై॥

2చరణం:
హిందూ ముస్లిం క్రైస్తవ పార్సి
ఏకవేదికన నిలవండోయీ  ॥2॥
రంగులెన్నైన రాష్ట్రమొక్కటని
జగతి కెల్లరకు చాటండోయీ  ॥జై జై॥

3.చరణం:
చిన్నా పెద్దను తేడాలొదిలీ
తెలంగాణమున మొక్కలునాటి
హరితహారముతొ అవని వెలుగునని
భావితరాలకు తెలుపాలోయీ ॥జై జై ॥

4.చరణం:
కులమత భేదాలన్నీ వదిలీ
చెరువులన్నింటి పూడికతీసి
కరువునేలలో సిరులు పండించి
రైతే రాజుగ యెదగాలోయీ   ॥జై జై॥


Thursday, August 2, 2018

నాకు నచ్చిన పుస్తకం - చిల్లరదేవుళ్ళు

విప్లవం మొదలు వేదాల వరకు జీవనయానం సాగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర వ్యాసుడు, నిత్యసాహితీ కృషీవలుడు గద్య దాశరథి కలంనుండి ఎగిసిన నవలాకెరటం "చిల్లర దేవుళ్ళు" గురించి గొల్లపెల్లి మండలకేంద్రంలో తెలుగు అధ్యాపకులుగా కొనసాగుతున్న పచ్చిమట్ల రాజశేఖర్ గారు తన అభిప్రాయాలనిలా వివరించారు.

               'పెన్నే గన్నుగా చేబూని' ప్రజాపక్షం వహించి పోరాడిన సాహితీయోధుడు దాశరథి రంగాచార్య. విషయమేదైనా కుండబద్దలు గొట్టినట్టు ముక్కుసూటిగ చెప్పడం ఆయన నైజం.తన రచనలతో ప్రజల్ని మేల్కొల్పడానికి, అన్యాయాన్నెదురించడానికీ ఇష్టపడే రంగాచార్యులుగారి తొలి నవల, తెలంగాణ మాండలిక నవలగా పేరు గాంచిన 'చిల్లరదేవుళ్ళు' 1969లో గ్రంథరూపు సంతరించుకుంది. రంగాచార్య రచనలు భావోద్రేకాల్ని రగిలించేకన్నా భావోద్వేగాల్ని కలిగిస్తాయని చెప్పొచ్చు. వట్టికోట ఆళ్వారు స్వామి వదిలివెళ్లిన ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని 'గంగు' కొనసాగింపుగా ఈనవల రాసారు. దానికి కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు కూడా రావడం జరిగింది. తెలంగాణ సాయుధపోరాటాన్ని దగ్గరగా వీక్షించుటచేత ఆనాటి పాలకుల తీరు, తెలంగాణ సామాజిక స్థితిగతులకు అద్దం పడుతుందీ నవల. గార్ల ప్రాంతంలోని జాగీర్దార్ల దాష్టికాలను కళ్ళకుగట్టింది. ఈనవలలోని పీరిగాడు, పాణిమంజరి, ఇందిర పాత్రలు నాటిప్రజలకు ప్రతినిధులై నిలిచారు. ఈనవలలో తెలంగాణ పలుకుబళ్లు, నుడికారాన్ని ఒలికించి అక్షరబ్రహ్మగ, సాహితీసమరయోధునిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు దాశరథి రంగాచార్య