Thursday, August 30, 2018

దత్తపదులు

దత్తపది
అందమ-కందమ-చందమ-విందమ

అందమ పర భాష పదములు తెలుగున
కందమవియ నెరుగు గాక నేమి
చందమ దియును గల్గి సరసుల వీనుల
వింద మదియొ నర్చు వేడ్కతోడ

కం.

కందమ తెలుంగు పద్యపు
అందమ యినట్టి అలంక రంపగు సొంపున్
చందమ లంకార మగుచును
విందమ హృద్యమ్మ గుతెలుగు వీనుల విందై

1 comment:

Malalapragada Rama Krishna said...

నేటి నస్తాక్షరి..ప్రాంజలి ప్రభ
క. మ. ల. ము.

కమలమందు పుట్టి మనసు కావ్య పరచి
మనుగడకు మార్గమును జూపి మాయ మాపి
లయలు చేస్తుంది శుభము ను లాస్య మనక
ముందు పరమాత్మ తలచియే ఉండు లక్ష్మి