Sunday, October 21, 2018

సమస్యాపూరణం

సమస్య: స్నాన జపమ దేల జంధ్యమేల

పూరణం:
మనుషు లందు తాను మానవ తనునిల్పి
ప్రాణి కోటి కంత బంచి ప్రేమ
సకల ప్రాణు లందు సర్వేశు కనువార
స్నాన జపమ దేల జంధ్యమేల

Thursday, October 18, 2018

గజల్

ఎగిసిపడే అలలెప్పుడు అలిసిపోవులే
ఎగబాకే కిరణమ్ములు అలసిపోవులే

చిట్టిచిట్టి పాదాలతో దూరాలను దాటుకుంటూ
బారులుతీరే చీమలు అలసిపోవులే

పరిపాలనపేరుతోటి ప్రజావంచన జేసెడు
దోపిడిదారులు యెప్పుడు అలసిపోరులే

సమాజరుగ్మతలను బాపి సమసమాజ స్థాపనకై
అహర్నిశలు శ్రమియించే సంస్కర్తలు అలసిపోరులే

సమాజంలొ తానుంటూ సర్వస్వము దోచుకుంటూ
అంచెలంచెలుగ యెదిగే పాలకవర్గం యెప్పుడు అలసిపోరులే

దేశప్రజల భవితకొరకు సాహిత్యము సృజియించే
కవిశేఖరు కలమెప్పుడు అలసిపోదులే

Friday, October 12, 2018

రుబాయీలు

కర్రూసిపోయిన నాగలి కన్నెర్రజేసింది
ముడుసులిరిగిన బండి మూలనగూసుంది
ఆధునిక వ్యవసాయపు తరీఖ జూసి
నాటి రైతు మొకాన నవ్వులు విరబూసినయి

రాష్ట్ర సాధనలోన రణరంగమయ్యింది
సకల జనుల చేత సాకారమయ్యింది
ప్రత్యేక రాష్ట్రమై ప్రజలకలలు పండేల
ప్రగతి మార్గంలోన పయనమయ్యింది

నీలోన లేనంటు తరచి  తా వెరిసింది
నాలోని తనరూపు జూసి మురిసింది
అర్దనారీశ్వరులమయ్యి జగతి దర్శింపగా
అణువణువు తనువంతా తాను మరిసింది

బతుకమ్మా!

తెలంగాణ సంస్కృతి బతుకమ్మా
తెలుగు ప్రజల హృదయార్తి బతుకమ్మా
తెలగణీయుల సంప్రదాయం బతుకమ్మా
తెలంగాణమట్టి పరిమళం బతుకమ్మా

నాడు మన బతుకులో భాగమై
తీరొక్క పూలతో సింగారిచ్చుకున్న బతుకమ్మా
నేడు ప్లాస్టిక్ పూలతో ఒళ్లంతా
మెరుస్తున్నా
సహజసౌరభ లేపనాలుడిగి కళదప్పింది బతుకమ్మ

 ఆడపడచులు చప్పట్లతో వంగిలేస్తూ
చూడముచ్చటగ ముదితల పాటలతో ఆడే పూలపండుగలో
పల్లె సంస్కృతి పరిమళించేది
తెలంగాణ కట్్ట్టుబొట్టుు
 తేటతెల్లమయ్యేది
కట్టుబొట్టుతో కనులవిందు జేసే
అలంకరణలు
కమ్మని రుచుల సత్తుపిండి వాయినాలు
అనుబంధపు దొంతరలై
అందమైన విరులై
బతుకమ్మ రూపమై
మనసులల్ల పదిలమై నిలిచే బతుకమ్మ

గుండెల్ని కుదేలు జేసే
డిజే సప్పుళ్ల మధ్య
శివసత్తులూగినట్టు
ఆధునిక పోకడల పేరుతో
ఆడిపాడే ఆటలతో
బతుకమ్మ  ఉనికికై పోరాడుతుంది
నాటి రూపానికై నానాపాట్లు పడుతున్నది

నాటి పెద్దమనుషుల పాటల్లేవు
నర్తిస్తూ ఆడేటి ఆటల్లేవు
కట్టుబొట్టు గనిపించని
ఆధునిక పడచుల జూసి
సిగ్గుతో ముఖం చాటేస్తుంది
నాతెలంగాణ
అల్లరి అరుపుల ఆటల జూసి
మౌనంగా రోదిస్తుంది నాతెలంగాణ

Tuesday, October 2, 2018

రుబాయీలు

జాతిగీతి జనులకంత వినిపించాడు
ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించాడు
వినీలాకాశంలో వికసించిన తారలాగ
విశ్వనేతయై గాంధీ కనిపించాడు


తుపాకులను చిరునవ్వుతో చిదిమేశాడు
అహింసయే ఆయుధంగ అడుగేశాడు
సహనానికి సాకారమై వివక్షలెన్నోదాటి
ప్రేమామృతాన్ని ప్రపంచానికి చవిచూపాడు

3.[11/2, 2:24 PM] Rajashekar Pachimatla: రుబాయి

కలిమి లేములవి కవలపిల్లలు
కష్టసుఖములవి కావడికుండలు
అదియెరుగని నరుని బ్రతుకు
అడుగడుగున సంఘర్షణలు
[11/2, 3:02 PM] Rajashekar Pachimatla:

4.బాల్యం మధురానుభూతుల పాలయేరు
యవ్వనం కొండలనుండి బారు సెలయేరు
గడిచిన క్షణమైన తిరిగి రాదనెరుంగక
ముదిమంత గతమునేలకో తలచేరు