Wednesday, August 31, 2022

గణేశుడు (పద్యాలు)

 సీసం॥

ఏడాది కోసారి యెలుకవా హనమెక్కి

ఇహలోక మంతతా దిరుగవచ్చె


దివిజలో కమునుండి దిగివచ్చి గణపయ్య

కొలువుదీ రెనిలను తళుకులొలుక


భక్తవ రులుజేరి భజనలు సేయంగ

మోదక ములుదినె మోదమలర


ఇల్లిల్లు దిరుగుతూ పిల్లల్ని దీవించి

విద్యబుద్ధులొసగె విమల యుతుడు

ఆ.వె.

మండ పముల జూచి మరలజాలకముర్సి

ఇహమునందె తాను తిష్టవేసె

పార్వతమ్మపిలువ పరవశ మునతాను

నాకలోక మరిగె నందమలర


పచ్చిమట్ల రాజశేఖర్ 

జగిత్యాల


 సీసం॥

ఏడాది కోసారి యెలుకవా హనమెక్కి

ఇహలోక మంతతా దిరుగవచ్చె


దివిజలో కమునుండి దిగివచ్చి గణపయ్య

కొలువుదీ రెనిలను తళుకులొలుక


భక్తవ రులుజేరి భజనలు సేయంగ

మోదక ములుదినె మోదమలర


ఇల్లిల్లు దిరుగుతూ పిల్లల్ని దీవించి

విద్యబుద్ధులొసగె విమల యుతుడు

ఆ.వె.

మండ పముల జూచి మరలజాలకముర్సి

ఇహమునందె తాను తిష్టవేసె

అంబతాను బిలువ నల్లారు ముద్దుగా

నాకలోక మరిగె నందనుండు


పచ్చిమట్ల రాజశేఖర్ 

జగిత్యాల


గణపయ్య రాకతో ఘనమైన వేడుక

జగమంత పందిళ్లు జనుల గుంపు

పగలంత పూజలు భజనల రాత్రిళ్లు

రేవగల్ భక్తుల 

Friday, August 26, 2022

నానీలు

 ఎన్ని వేళ చేతులు

బురదను చిలికాయో

అన్నపు వెన్నను

వెలికి తీయుటకు


కూరగాయలకై

నింగిని వెదికాను

వాటికీవేళ 

రెక్కలొచ్చాయిగా


మేఘం వర్షించింది

పంటచేలపై

రైతు కన్నీరు

వాటిని తడుపలేదని


జీవన క్షేత్రంలో

ఆశలు మొలకెత్తాయి

చెమటచుక్కలు

నేలను తడిపి


రైతన్న 

పొద్దెక్కినా లేవలేదు

తాగింది

పురుగు మందుకదా


గాలిపటం

పైకెగురడం లేదు

దారం తెగింది

గమనించలేదు


ప్రజాస్వామ్యం

పైసకు గులామైంది

ఓటరు

కాసు క్కూసున్నాడు గదా


పాలకులు 

దోచేస్తున్నరు

ఎలక్షన్లలో

పంచేందుకు


జెండాలు ఎజెండాలు

పార్టీలు మార్చుతుండ్రు

పాలకులు

ఊసరవెల్లికి పోటీగా


చెరువుల 

యెదలెంత సంకుచించాయి

చినుకును సైతం

ఛీకొడుతున్నాయి.

Tuesday, August 16, 2022

అద్వితీయ స్వర్గసీమ (అఖండ భారతం)

 స్వదేశీ సంస్థానాలాదిగా

విదేశి పాలకుల అణచివేత ధోరణికి

అడ్డుకట్ట వేసేందుకు అలలై ఎగిసి

ఉద్యమించి ఉరిమిన

వీరుల నుదుటి తిలకమె  

కాషాయమై మురిసిన జెండా!


స్వచ్ఛతరోజ్వల హిమగిరి 

శిరమున జాలువారిన

జీవనదుల తరగల నురగలై

జిలుగులు పంచే వెన్నెల వెలుగులై 

తెలుపు వర్ణమై మెరిసిన జెండా!


ప్రకృతి పురుడువోసిన పచ్చని వనసీమలు

వర్షాధార తృణధాన్యాల రాశులు

అన్నపూర్ణావతారమై అలరారిన

భరతావని యెదపై ఏపుగ పెరిగిన

పజ్జొన్నలు పంటపొలాలె

పచ్చరంగు పులిమిన జెండా!


అహింసోద్యమం మొదలు

అరాచక పాలకుల తరిమేదాక

ఎందరో షహీద్ ల వెచ్చని ఊపిరులు 

తనువణువణువూ నింపుకున్న తిరంగజెండా!

త్యాగధనుల తనురుధిర దారల

తానమాడిన అరుణపతాకం మనజెండా!

కశ్మీరం మొదలు కన్యాకుమారి దాక

విభిన్న సంస్కృతుల విశిష్ట మేళవింపు

ధార్మిక వర్తన తాత్త్విక చింతనలో

విరిసి మెరిసిన ఇంద్రధనసు మనజెండా!


భరతమాత శిరమున భ్రమరమై ఎగురుతూ

భరతజాతి యెదలో  సాకారమైన గర్వరేఖై ఒదుగుతూ

సర్వమత సహన రూపమై సాగుతూ

భారతీయతత్వంతో ఫరిఢవిల్లుతూ

ప్రపంచం ప్రణమిల్లే పవిత్రమూర్తి!

విశ్వమంతా వీక్షించే విమలమూర్తి!

అద్వితీయ స్వర్గసీమ అఖండ భారతం!



Saturday, August 6, 2022

మినీ కవితలు

 రాత్రి చీకటి

గొంగలి పరుచుక్కూసుంది

వెలుగు రేఖలు

ధరజేరకుండ


పాలమూరు కూలుల

రక్తం పీలుస్తున్నాడు

భగ్గుమన్న సూరీడు

కిరణాల స్ట్రాలతో


చెరువుల యెదలన్నీ

కుంచించుకున్నాయి కాబోలు

చిన్నచిన్న వరదలనే

ఇముడ్చుకోలేక పోతున్నయి




Monday, August 1, 2022

మసక బారిన గౌడవృత్తి

 పొద్దుమాపుసెలగి పోద్దాళ్లు గీసినా

సంసార మనునావ సాగదాయె

పొలుమారులుదిర్గి పలుయీదులిడిసినా

అవసరాలకుపైక మంద కుండె

కావళ్లు గట్టితా కల్లుమోసినగాని

కష్ఖము డుగుదారి గానరాదె

పొద్దస్తమానముల్ పొర్లాడిననుగాని

కూడుగుడ్డలేక గోడు మిగిలె


గానుగెద్దుతీరు గౌడు దిర్గినగాని

రాదుపగలనేది రాత్రిదప్ప

పెద్దతాటిచెట్టు పిసరంత నీడోలె

పేరుగొప్పె గాని ఊరు దిబ్బ