Wednesday, November 30, 2022

పచ్చని లతలతో అల్లిన ఏనుగు వర్ణన చిత్ర పద్యం

 సీసం

ప్రకృతియే వృక్షమై పరవశించినదేమొ

నగములన్నిహరిత సొగసులందె


కొండయేనుగుతాను గున్నేను గైపిల్వ

గర్జాట్ట హాసాన గంగజారె


ఆకసా న్నందేటి అడవియే నుగుజూచి

దూదిపింజలుమూగి దిరుగసాగె


తొండమే వాహికై కొండయేనుగు నీల్వ

వారిదమ్ములుకర్గి వాహినయ్యె


గహనతరములైన గగనదిబ్బలుముర్సి

తరలివచ్చెనిలకు దారలయ్యి

తొండమెక్కి నిలిచి 

తుంటరా తనొకడు

అందుకొనగ జూచె నాకసమును


పచ్చిమట్ల రాజశేఖర్

సీసం

ప్రకృతియే వృక్షమై పరవశించినదేమొ

నగములన్నిహరిత సొగసులందె


కొండయేనుగుతాను గున్నేను గైపిల్వ

గర్జాట్ట హాసాన గంగజారె


ఆకసా న్నందేటి అడవియే నుగుజూచి

దూదిపింజలుమూగి దిరుగసాగె


తొండమే వాహికై కొండయేనుగు నీల్వ

వారిదమ్ములుకర్గి వాహినయ్యె


గహనతరములైన గగనదిబ్బలుముర్సి

తరలివచ్చెనిలకు దారలయ్యి

తొండమెక్కి నిలిచి 

తుంటరా తనొకడు

అందుకొనగ జూచె నాకసమును


పచ్చిమట్ల రాజశేఖర్

Wednesday, November 16, 2022

సూర్యోదయ వర్ణన

 విరుల రెక్కలన్ని వికసింప జేసేల

పక్షిజాతులన్ని పలువరింప

ఆకు లన్ని శాఖ లంకు రింప

సర్వ జీవ కోటి చైతన్య మందేల

ప్రభలు గొల్ప వచ్చె ప్రభకరుండు

Tuesday, November 8, 2022

సైనికత్యాగం (గజల్ )

 హిమనగమున మంచుపొరలు ఎరుపెక్కిన వెందుకనో

భరతావని గుండెగదులు బరువెక్కిన వెందుకనో


చల్లనైనవీచికలతొ విశ్వమంతసరసమాడ

సుమవనమున పొరలుతావి ఘాటెక్కిన దెందుకనో


మంచునడుమ దిరిగాడెడు నాపెనిమిటి తలపుకొస్తె

నామనమ్ము దిగులుగమ్మి బరువెక్కిన దెందుకనో


తెలిమాపున చలిగాలులు తెప్పలుగా వీయువేళ

దనకౌగిళి తలపురాగ తీపెక్కిన దెందుకనో


ఈదేశపు సౌభాగ్యము నీచేతుల దాగెనేమో

నినుజూడ నిరీక్షించి అలుపెక్కెను యెందుకనో


నీదేహము నెత్తురోడి నిశ్చలమై నేలగూల

నింగిజారి యాపతాక తనువెక్కెను యెందుకనో


తొలిపొద్దును చూడలేక మూసుకున్న రాజుకనులు

ఆకసమున ధృవతారను వెదుకుతున్నవెందుకనో

Sunday, November 6, 2022

వీరనారి

 

వెనుకటి కాలాన వెన్నుదాల్చిసుతుని

యుద్ధమాడినపోరు ముద్దుబిడ్డ

గుర్రమెక్కితాను విర్రవీగుటెగాదు

పరసేనలనంత పారజేసె

తానుజేసినపోరు ధరణిలోవెలుగొంది

వీరనారిపేర వినతికెక్కె

రాజ్యభారముగొన్న రాణిరుద్రమదేవి

మార్గదర్శనమయ్యె మహినిజనుల


కొడుకు వీపుగట్టి కొంగు నడుముజుట్టి

నాటిబాటలొంటి నాతినడిచె

బతుకుదెర్వుకొరకు పడతివిజృంభించి

సైకిలెక్కిసాగె శ్రమను నమ్మి





Friday, November 4, 2022

ఆడవారి ప్రతిభ

 ముదితల్ మూఢుల టంచున్

విధితప రిచిమురి యునుగద విభుదులు సభలన్ 

విధిత మ్ముగవి ద్యగరుప

ముదితల్ నేర్వంగ రారే ముద్దార నేర్పన్