Friday, August 14, 2026

దేశభక్తి (గజల్)

 వాగ్దేవి సాహితీ వేదిక గజల్ పోటీ కొరకు

అంశము: దేశభక్తి

పేరు: రాజశేఖర్ పచ్చిమట్ల

        జగిత్యాల 

 9676666353

ఇది నాస్వీయరచన.ఇదివరకెక్కడా ప్రచురించిబడలేదని హామీ ఇస్తున్నాను.

--   -  -  -  -   -   -   -   -   -   -   


లోకమంత భూతదయతొ మెలుగుటయే దేశభక్తి

మనుషులంత మానవతతొ మసలుటయే దేశభక్తి


పొంగిపొరలె వాహినులై(సెలయేళ్లుగ) సాగి పోతే లాభమేమి

చలిచెలిమై దాహార్తులు తీర్చుటయే దేశభక్తి


నింగినంట శాఖలుగా విస్తరించ ఫలితమేమి

పుఢమినంటి క్షుద్బాధలు దీర్చుటయే దేశభక్తి


తేనెటీగ వైధనమును గూడబెట్ట ఫలితమేమి

పేదవారి దారిద్ర్యము తుంచుటయే దేశభక్తి


నిరంతరం కడలివయ్యి ఘోషించిన ఫలితమేమి

మేఘమయ్యి ఉరిమికురిసి పారుటయే దేశభక్తి


దలారులై శ్రమదోపిట దండుకుంటె ఫలితమేమి

సేద్యకాని చెమటవిలువ పెంచుటయే దేశభక్తి


అధినేతగ అందినంత దోచుకొంటె లాభమేమి

సైనికుడై మాతృభూమి కాయుటయే దేశభక్తి


ఊసువోక రాసుకుంటే ఫలితమేమి కవిశేఖర

రచనలతో దేశగతిని మార్చుటయే దేశభక్తి