పల్లవి:
జై జై తెలగణ స్వాతంత్ర్యాభ్యుద
యానందోత్సవ శుభ సమయం
ప్రియతమ తెలగణ జనయిత్రీ చిర
దాస్య విమోచన నవోదయం ॥2॥
1చరణం:
పొద్దుపొడిచె లేవండోయీ
నిద్రవిడిచి రారండోయీ ॥2॥
బంగరుభవితకు బాటలు వేయుచు
జాతిని జాగృత పరచాలోయీ ॥జై జై॥
2చరణం:
హిందూ ముస్లిం క్రైస్తవ పార్సి
ఏకవేదికన నిలవండోయీ ॥2॥
రంగులెన్నైన రాష్ట్రమొక్కటని
జగతి కెల్లరకు చాటండోయీ ॥జై జై॥
3.చరణం:
చిన్నా పెద్దను తేడాలొదిలీ
తెలంగాణమున మొక్కలునాటి
హరితహారముతొ అవని వెలుగునని
భావితరాలకు తెలుపాలోయీ ॥జై జై ॥
4.చరణం:
కులమత భేదాలన్నీ వదిలీ
చెరువులన్నింటి పూడికతీసి
కరువునేలలో సిరులు పండించి
రైతే రాజుగ యెదగాలోయీ ॥జై జై॥
జై జై తెలగణ స్వాతంత్ర్యాభ్యుద
యానందోత్సవ శుభ సమయం
ప్రియతమ తెలగణ జనయిత్రీ చిర
దాస్య విమోచన నవోదయం ॥2॥
1చరణం:
పొద్దుపొడిచె లేవండోయీ
నిద్రవిడిచి రారండోయీ ॥2॥
బంగరుభవితకు బాటలు వేయుచు
జాతిని జాగృత పరచాలోయీ ॥జై జై॥
2చరణం:
హిందూ ముస్లిం క్రైస్తవ పార్సి
ఏకవేదికన నిలవండోయీ ॥2॥
రంగులెన్నైన రాష్ట్రమొక్కటని
జగతి కెల్లరకు చాటండోయీ ॥జై జై॥
3.చరణం:
చిన్నా పెద్దను తేడాలొదిలీ
తెలంగాణమున మొక్కలునాటి
హరితహారముతొ అవని వెలుగునని
భావితరాలకు తెలుపాలోయీ ॥జై జై ॥
4.చరణం:
కులమత భేదాలన్నీ వదిలీ
చెరువులన్నింటి పూడికతీసి
కరువునేలలో సిరులు పండించి
రైతే రాజుగ యెదగాలోయీ ॥జై జై॥
No comments:
Post a Comment