Sunday, August 19, 2018

కానకూన

పచ్చని ప్రకృతి ఒడిలో
పులకించె తనువు
పక్షుల కిలకిలతో
పరవశించే మనము
చెట్టుచేమలు నేస్తాలుగా
కొండాకోనలు బాంధవులుగా
గిలిగింతలు వెట్టే పిల్లతెమ్మెరలు
మైమరిపించే మలయమారుతములు
ప్రాకృతిక జీవన మొనరించు
కానకూన
అరవిరిసిన అరవిందం
ఆకుపచ్చని చంద్రబింబం
చెదరని చెంగావి దరహాసం
జిలుగులద్దుకున్న చెక్కుటద్దములు
కనులలోదాగిన కలువరేకులు
మచ్చెరుగని మనసుగలిగిన
కందెరుగని కోమలి
ఎవరీ సరసిజ నయనీ?
మన్నెంలో విరిసిన మొగిలి!
అడవితల్లి ఆత్మజ!!

No comments: