Sunday, March 21, 2021

గజల్

 మనసులోని మలినాలను కడుగుతోంది దిగులుమబ్బు

బతుకుజడిలొ అలలపైన తేలుతుంది దిగులుమబ్బు


ఊహలలో మలయజమై ఆశఊసులాడుతున్న

సంతోషపు వీచికలను తరుగుతోంది దిగులుమబ్బు


భావిబతుకు దారులలో విరులెన్నో పరుచుకున్న

సౌరులన్ని సడలిపోవ వరలుతోంది వాయుమబ్బు


హాయిబంచు ఆశలతో  మదివిహగము మురిసియాడ

కలలగతము కలవరమై పొరలుతోంది పరువుమబ్బు


సెలయేటివెల్లువయ్యి చెలగిదుంకు శేఖరుమది

కలతలెన్నొ ముసురుకుంటు వరలుతోంది వలపుమబ్బు

No comments: