Sunday, November 5, 2023

మళ్లీ పోవాలనుంది పళ్లెటూరుకు (పాట)

మళ్లీ పోవాలనుంది పళ్లెటూరుకు

ఒళ్లో వాలాలనుంది తల్లిపేగుకు

మళ్లీపోవాలనుంది పల్లెటూరుకు

మళ్ళిమళ్ళీ పోవాలనుంది తల్లిచెంతకూ

అలలతీరు ఓలలాడే అనుభవాలు నెమరేయుచూ

అనుభవాల దొంతరలను అహర్నిశలు తడిమేయుచూ

మళ్లీ పోవాలనుంది పళ్లెటూరుకు

ఒళ్లో వాలాలనుంది తల్లిపేగుకు

వసివాడని పసిప్రాయం గిలిగింతలు పెడుతుంటే

ఆప్యాయత లొలికేలా అమ్మలాలి పాడుతుంటే

చిన్ననాటి జ్ఞాపకాలు కెరటాలై మెదులుతుంటే

ఒదగాలని వున్నది ఆమధురావని ఒడిలోనికి  ॥మళ్లీ॥


పల్లెనిడిచి తల్లినిడిచి వెలగబెట్టినదియేమిటొ

పచ్చదనపు గుండెచీల్చి బావుకున్నదది యేమిటొ

నిలువనీడనిచ్చు తరుల తగులబెట్టె కుతంత్రాల

వాసనైన సోకనట్టి జనపదాల జాడవట్టి  ॥మళ్లీ॥


ఎంతకాలమయ్యిందో యెదలనిండ శ్వాసించి

 ఎన్నిరోజులయ్యిందో  మనసారా భాషించి

 ఒక్కసారి తనివి తీర మట్టిని ముద్దాడాలి

(తనివితీర తల్లియెదను తడిమి మురిసిపోయేందుకు )

 యెండినఆతల్లి యెదను ప్రేమతొ  ఓదార్చుటకూ ॥మళ్లీ॥

ఆఘ్రానించాలనుంటే ఆమట్టి పరిమళం

ఆస్వాదించాలనుంటే  ఆజీవనమాధుర్యం

తప్పదు మానవజాతి ఆత్మావలోకనం  

ప్రగతిముసుగుదీసి మరల పల్లెసొగసు చూసేందుకు ॥మళ్లీ॥ 

మరబతుకులు మాకొద్దని మనసు మొత్తుకుంటుంటే

పచ్చనైన పల్లెసీమ స్వాగతాలు పలుకుతుంటే

సీతకోకలై మనస్సు గాలిలోన తేలియాడ

కలలు మరచి కన్నతల్లి కౌగిలిలో చేరేందుకు ॥మళ్లీ॥

తప్పటడుగు తెలుసు కోని తల్లి 

సాలెగూటి పోగులోలె సాగుతు



No comments: