బంగరు కాంతులు జిమ్మే వేకువంటే నాకిష్టం
పొగ మంచై పైకెగసే వెల్లువంటె నాకిష్టం
వెన్నెలంత దాచుకున్న చిన్నదాని మోముపైన
జారిపడే దరహాసపు అలలంటే నాకిష్టం
పచ్చదనపు చిరునామై చిగురించిన తరులసిగల
అరవిరిసీ సౌరులొలుకు విరులంటే నాకిష్టం
రైతు చెమట బిందువులతొ దాహర్తిని తీర్చుకొని
పైరులుగా రాశివోసు సిరులంటే నాకిష్టం
నీలిమబ్బు తనువిరిసిన మెరుపుకన్న కవిశేఖర
నిశిరాతిరి దారిజూపు చుక్కలంటె నాకిష్టం