1.సీసం.
కొండవీడు వంశ కొదమసింహపుఛాయ
వేమన్న జన్మించె వెలుగు బంచ
రాజ్యపా లనమందు రంజన మ్మొందక
వేశ్యలోలుడయ్యె వేమరెడ్డి
సరసాలు విరసాలు సాగించ నాయింతి
సర్వసం పదలెల్ల స్వాహజేసె
వదినెయా నతితోడ వలువలొ లిసిజూసి
భోగమ్ము లన్ రోసి యోగియయ్యె
ఆ.వె.
మౌన మాచ రించి యొనరించె సత్కృతుల్
సర్వ జనుల మతిని చక్కజేయ
వేమనార్యు డొసగె వేలాది పద్యముల్
ధరణి జనుల కెల్ల దారి జూప
2.సీసం.
వేమన్న బెకిలించె వేవేల అంశముల్
లోకమం దున్నట్టి లోటుపాట్లు
విగ్రహా రాధనన్ మిగులవి మర్శించి
మూఢవిశ్వాసాల మొదలు త్రుంచె
కోటివి ద్దియలన్ని కూటికొ రకెయంచు
దొంగస న్యాసుల తూలనాడె
సామాన్య నీతులన్ చక్కగా జెప్పుచూ
అఖిలజ నులమది నాక్రమించె
ఆ.వె.
వేల వేల కొలది వెలయించె పద్యముల్
సంఘ జనుల రీతి సంస్కరించ
ధరణి పాడి దప్ప తనదైన రీతిలో
కలము కొరడ బట్టె కవిగ తాను
3.సీసం.
వేశ్యవా కిటనుంచి వేద్యుడై వెలుగొంది
జ్ఞాననే త్రమువిచ్చి జ్ఞాని యయ్యె
ప్రజబట్టి వేదించు పలుసమ స్యలనెల్ల
పరికించి దరిజేర్చ పరితపించె
హాస్యమ్ము వ్యంగ్యమ్ము ఆక్షేప మొనరించ
చతురత నాక్రోశ సరస పరిచి
ఉపమాన దృష్టాంత సూక్తిప్రా యమ్ముగా
నీతుల బోధించె నేతులలర
ఆ.వె.
సానబెట్టెకవిత జనరంజ కములయ్యి
ఉపము గూర్చె వసుధ యోర్పు మెరియ
వెలది చెలిమి జేసి వేదవేద్యుండయ్యి
మూఢజనులకెల్ల మోక్షమొసగె
No comments:
Post a Comment