మనసులోని అలజడులను ఆపలేక పోతున్నా
ఈ సమాజ వేదనలూ తాళలేక పోతున్నా
ప్రగతిమాటు ప్రళయాలను ప్రశ్నిస్తే ద్రోహమనే
రాజకీయ ఎత్తుగడలు గెలువలేక పోతున్నా
స్వార్థపరత పెరిగిపెరిగి కుళ్ళికంపు కొడుతున్నా
పైపైదిద్దే మెరుగులు చూడలేక పోతున్నా
నివురుకింద నిప్పుందని లోకమంత చెబుతున్నా
అవివేకపు చీకట్లను చీల్చలేక పోతున్నా
సాలెగూడు సంసారము అందాలకు బందీనై
అనురాగపు బంధాలను వీడలేక పోతున్నా
No comments:
Post a Comment