Sunday, November 8, 2026

వెన్నెల దాగనేమొ (గజల్ )

 విరిసిననీ కన్నులలో వెన్నెలలే దాగెనేమొ 

ముసిరిన ఆ మబ్బులలో  వాహినులే దాగెనేమొ 

చిరునవ్వులు వెలిసిపోయి  చిన్నబోయె చెలిమోము

సరసపుహృది లోతులలో వేదనలే దాగెనేమొ

సింగిడులై ఆకసాన సీతాకోక చిందులేయ

సొగసులొలుకు చెలిదేహము పూవనమే తలచెనేమొ

భూమాతకు పచ్చకోక చుట్టాలని యాతనేల

తనువణువూ కోకొల్లలు వలువలనే దాచెనేమొ 

చీకటంత శూన్యమనుట భావ్యమౌన కవిశేఖర

మస్తిష్కపు దొంతరలో యోచనలే  దాగెనేమొ

No comments: