Tuesday, October 27, 2026

వెన్నెల వాకిళ్ళు తెరిచి పిలుస్తోంది ఆకాశం (గజల్ )

 వెన్నెల వాకిళ్లు తెరిచి పిలుస్తోంది ఆకాశం 

చుక్కల ముగ్గులు పరిసి నిలుస్తోంది ఆకాశం 

మనుషుల బంధించేందుకు కులమతాల కంచలేల

 జీవులకంతకు నీడగా నిలుస్తోంది ఆకాశం 

కలిమిలేముల పేరట కలహమ్ములు మనకెందుకు  

నూలుపోగు లేకుండనె పిలుస్తోంది ఆకాశం 

ఘర్షణ లేకుండా ఘనత సాధించుట సాధ్యమౌన 

కరిగిన మబ్బులె నీరుగ కురుస్తోంది ఆకాశం 

ప్రసవ వేదనల ఫలితం తెలియనిదా కవిశేఖర  

మదనానంతర కవితె గెలుస్తోంది ఆకాశం 

No comments: