Sunday, November 8, 2026

దీపావళి (గజల్ )

 వరుసలుగా దివ్వెలన్ని వెలిగించుటె దీపావళి 

వరుసలతో బంధుత్వము మొలిపించుటె దీపావళి 


చీకట్లను కాల్చలేని ప్రమిదలున్న ఫలమేమిటి 

బతుకుబాట కైకాంతులు ప్రసరించుటె దీపావళి 


సమాజగతి మార్చాలని కలలుగంటూ కూర్చొకుండ 

తోటివారి కనులుతుడుచి నడిపించుటె దీపావళి 


చెలికాల్లతొ చిందులేసి కాలమెల్ల బుచ్చకుండ

ప్రగతికోరు పథములకై గాలించుటె దీపావళి 


చుక్కలతో పోరునట్లు దివ్వెలుంచు కవిశేఖర 

అవెలుగుల అమవసనిశి మరిపించుటె దీపావళి

No comments: