Wednesday, October 19, 2022

అన్నయననేమి (పద్యాలు)

 సీసం1:

అన్నయనగనేమి వయసుభేదముగాదు

పెద్దయగునుతాను బుద్దితోడ

అన్నయనగనేమి వయసుభేదముగాదు

తనపరమ్మెరుగని తన్మయతన

అన్నయనగనేమి వయసుభేదముగాదు

చెలగిపం చెడునట్టి చింతతోడ

అన్నయనగనేమి వయసుభేదముగాదు

తానుదినకబెట్టు తపన తోడ

ముందుబుట్టినంత ముద్దుసేసినయంత

అన్నలవ్వబోరు అగ్రజుండు

అన్నయౌను తాను ఆత్మీయతలతోడ

పెద్దబుద్దితోడ పెరిమతోడ


సీసం2:

అన్నయవ్వునుతాను అమ్మలేనవ్వేళ

లాలనమ్మునుజేసి లాలబోసి

అన్నయవ్వునుతాను నాన్నలేనవ్వేళ

పొద్దుమాపుందాక పోషియించి

అన్నయవ్వునుతాను ఆహార్యమెరుగక

ముడ్డిగుడ్డల్లేక ముద్దుసేసి

అన్నయవ్వునుతాను ఆడంబరములేక

ఆటలాడుచుతాను ఆదమరిచి

అన్నతానవుతడు ఆలపాలనమున

యగ్రజుండు గాదు అన్నయనగ

అన్నతానవుతడు తనయాకలిమర్చి

పెరిమతోడముద్ద పెట్టువాడు

Monday, October 3, 2022

విష్ణుమూర్తి కొయ్యరూపం పై పద్యం

 (ఉత్కళ దేశపు కొయ్యరూప జగన్నాథునిపై  సీసపద్యం)

సీసం:

ఒకభార్య ప్రకృతిమరొకభార్య చంచలా

ఒక్కటి తిరముమ రొక్కచరము

తనయుండు మన్మథు తలపునదొరకడు

అశరీరి యైజను లందరి బాధించు

తనుబడలికబాప తల్పమొం దుదమన్న

పడగవేలుగలిగి పడక గాదు

గరుడవాహనమెక్కి గమియించెదమన్న

పాముల గనితాను వాలుపుఢమి


ఇన్ని బాధలు తలచియా విష్ణుమూర్తి

సకల సంపద లుండినా వికలమొంది

వివిధ రూపము లన్నిటి విడిచిపెట్టి

కొయ్య బారెను గదవిష్ణు కోరిజగతి

మాట విలువ (కందం)

 మాటే బంధము లుగలుపు

మాటే తెంచును చెలిమిని మనుషుల నడుమన్

మాటే ప్రాణము నిలుపును

మాటే రందులు జెరచును మనముల నెడలన్

Sunday, October 2, 2022

వాణీ స్తుతి

 వాణీ!పుస్తకపాణీ

వాణీ!తేనియపలుకుల వాసిని దేవీ!

వాణీ!మధురోక్తనిలయి

వాణీ!నాకొసగుమమ్మ వాక్కుల వరుసల్

Friday, September 30, 2022

రుదిర హిమవత్పర్వతం

 ప్రకృతి రామణీయకత 

పరిఢవిల్లిన నేల

దాయాదుల పోరు దద్దరిల్లిన నేల

పచ్చదనపు పరవశపులోగిల్ల

వెచ్చని రుధిరం 

తనువున జల్లుకుని పరిపరి విధాల

పరితపించిన నేల

వేటకుక్కలై తరుముకొస్తున్న ప్రత్యర్థిమూకలను

వెన్నుచూపని ధైర్యంతో నిలువరించిన ధీరులు!

ఎగిరే బాంబులై ఎదుటివారిపై

రెక్కలు విచ్చుకు పోరాడిన పందెంకోళ్లు!

దాయాదుల తుపాకులు

తనువును చిద్రం చేస్తున్నా

మొక్కవోని ధైర్యం మొకాన నిల్పుకొని

ముందుకుసాగిన సాహస తూటాలు!

కసాయి తూటాలు గుండెల్ని చీల్చినా

కారుతున్న రక్తపుటేరులతో

నేలతల్లి ఎరుపెక్కి జడుసుకుంటున్నా

అడుగు నేలనుసైతం ఆక్రమించనీకుండా

ముందుసాగిన మందుగుండ్లు!

సాయుధ బలగాలపై ఉక్కుపాదం మోప

వీజృంభించి కదిలిన యుద్ధ ట్యాంకులు!

భరతమాత ప్రియసుతుల పదకవాతుతో

పౌరుషం నిండిన నేల కార్గిల్!

ఆదమరిచి నిద్రించిన భరతమాత ఉలికిపడినదినం!

యావత్ భారతం భీతిల్లిన భయానకఘట్టం!

వీరోచితపోరాటాల ఫలితం!

తుపాకి తూటాలకు ఎదురేగిన సాహసం!

జనని భారతికి అంజలిఘటించి

సమర్పించిన 

ఎరుపెక్కిన అడవిమల్లెల హారం!

గెలుపూ ఓటమి

పరాక్రమం పలాయనం

జననం మరణం

జయజయ ధ్వానాలు హాహాకారాల  సమాహారం!

తెలిమంచు పైపొరలొ మోదుగుపూలు తాపిన

రుధిర హిమాలయం కార్గిలు

ఎందరో వీరులు మరణమొక జననమై

రణము జేసిన కార్గిలు

ఎందరో యోధులను తన ఒడిన జోకొట్టి

అమరులను జేసిన మరుభూమి కార్గిలు!




Monday, September 12, 2022

మీసపు లోటు పద్యం

 నల్లమీ సముగల్గి నగుమోము గల్గియు

ఆనంద వర్ధనుం డౌను నరుడు

గుబురు మీసముగల్గి కోపమొందెడుమోము

పుఢమి జనులకంత బుగులు గొల్పు

రొయ్యమీ సముగల్గి రోషమొందెడుమోము

పౌరుష పుగురుతు పౌరుడిలలొ

బారుమీ సముగల్గి భాసిల్లు మోముతో

మంత్రగానివలెను మనుజుడుండు

తే.గీ.

మీస మేలేని మోమంత మిగుల కాంతి

అదియు లేనియాహార్య మతిశయించు

మీస మదిలేక తపియించి మిడుక నేల

పేడి మూతివాడునిత్య పెళ్ళికొడుకు

మీసము మెలిక పద్యం

 సీసం:

అర్థులందరిబిల్చి యాదరించెడువాడు

దాతయై వర్ధిల్లు ధరణియందు

దుఃఖితు లనుజూచి దూరనొ ల్లనివాడు

సుమతియై వెల్గువ సుమతియందు

ఆకలనినవార నక్కుజే ర్చెడువాడు

అక్షయ పాత్రయై యవని మిగులు

కామితా ర్థములిచ్చి కరుణజూ పెడువాడు

కల్పవృ క్షమ్మంటు ఘనతనొందు


సకల లేమి దీర్చి స్వాంతనమొనగూర్చి

ఉల్ల మొసగి యెదలు వెల్లి విరియు

నట్టి మూతి మీస మాలంకృతమెగాని

ఈవిలేని మూతి మీసమేల?