(ఉత్కళ దేశపు కొయ్యరూప జగన్నాథునిపై సీసపద్యం)
సీసం:
ఒకభార్య ప్రకృతిమరొకభార్య చంచలా
ఒక్కటి తిరముమ రొక్కచరము
తనయుండు మన్మథు తలపునదొరకడు
అశరీరి యైజను లందరి బాధించు
తనుబడలికబాప తల్పమొం దుదమన్న
పడగవేలుగలిగి పడక గాదు
గరుడవాహనమెక్కి గమియించెదమన్న
పాముల గనితాను వాలుపుఢమి
ఇన్ని బాధలు తలచియా విష్ణుమూర్తి
సకల సంపద లుండినా వికలమొంది
వివిధ రూపము లన్నిటి విడిచిపెట్టి
కొయ్య బారెను గదవిష్ణు కోరిజగతి
No comments:
Post a Comment