Wednesday, October 19, 2022

అన్నయననేమి (పద్యాలు)

 సీసం1:

అన్నయనగనేమి వయసుభేదముగాదు

పెద్దయగునుతాను బుద్దితోడ

అన్నయనగనేమి వయసుభేదముగాదు

తనపరమ్మెరుగని తన్మయతన

అన్నయనగనేమి వయసుభేదముగాదు

చెలగిపం చెడునట్టి చింతతోడ

అన్నయనగనేమి వయసుభేదముగాదు

తానుదినకబెట్టు తపన తోడ

ముందుబుట్టినంత ముద్దుసేసినయంత

అన్నలవ్వబోరు అగ్రజుండు

అన్నయౌను తాను ఆత్మీయతలతోడ

పెద్దబుద్దితోడ పెరిమతోడ


సీసం2:

అన్నయవ్వునుతాను అమ్మలేనవ్వేళ

లాలనమ్మునుజేసి లాలబోసి

అన్నయవ్వునుతాను నాన్నలేనవ్వేళ

పొద్దుమాపుందాక పోషియించి

అన్నయవ్వునుతాను ఆహార్యమెరుగక

ముడ్డిగుడ్డల్లేక ముద్దుసేసి

అన్నయవ్వునుతాను ఆడంబరములేక

ఆటలాడుచుతాను ఆదమరిచి

అన్నతానవుతడు ఆలపాలనమున

యగ్రజుండు గాదు అన్నయనగ

అన్నతానవుతడు తనయాకలిమర్చి

పెరిమతోడముద్ద పెట్టువాడు

No comments: