Friday, September 18, 2026

(గజల్) చిరునవ్వే


చిరునవ్వే పలకరింపు చిరునామగ బతకాలి 

కనుచూపే పలువురికి ఆదరణగ నిలవాలి 


ఊసుపోని మాటలతో నిలుస్తున్న దా స్నేహము

ఆపదలలో నాచెలిమికి చేయూతగ మిగలాలి 


చీకటెంతొ ముసురిందని నిందించకు భావినెపుడు

పథమునడుచు అడుగులకూ ప్రదీపికగ వెలగాలి 


అనంతమౌ పయనంలో నీరసించి నిలువనేల

ప్రళయంలో వలయంలా దరిజేరగ నడవాలి 


వలపుపిలుపు కవ్వింపులు తెలియనిదా కవిశేఖర

సరసములో ఇరుతనువులు  నిండారగతడవాలి

No comments: