నీ నవ్వే హరివిల్లయి విరిసింది నా మదిలో
నీ కినుకే జడివానై కురిసింది నా మదిలో
నా తలపులు నీ ఊసుల కంచెలుగా మారెనుచెలి
నే గాంచిన నీరూపము మెరిసింది నా మదిలో
ఆమనదిగొ వస్తుందని ఆకులన్ని రాల్చినాను
నీరులేని ఎండమావి పరిసింది నా మదిలో
జతకట్టే సమయమ్మని కోయిలమ్మ కూయనేల
విరహపు ఆ వేదనయే విసిరింది నా మదిలో
భావిజూసి ఆశపడుతూ బతకవలెను కవిశేఖర
కాలగతిన కలలెన్నో పరిచింది నా మదిలో
No comments:
Post a Comment