గణేశస్తుతి
విఘ్న ములను బాపు విఘ్నేశు నీవంచు
శతక మునొన రించ చెంత కొస్తి
సంక టముల చింత సాంతము తొలిగేల
దీవెనొసగు మయ్య దేవ దేవ
మోహ రూపు తోడ మోదక హస్తుడై
ఆది దైవ మయ్యె నవనియందు
విమల పద్య దార వెల్లువై సాగేల
వరము నొసగు మయ్య వారి జాక్ష
ఒంటిదంతదేవ ఉల్లమందుననిల్చి
సరళభావదార సాగనిమ్ము
పండితుడనుగాను పసిబాలకుడనేను
తప్పుదొర్లకుండ దాపునిల్వు
వాణీస్తుతి
విమల వస్త్రము దాల్చిన విబుధకోటి
కమలపీఠము నెక్కిన కరుణమూర్తి
వీణ ధరియించి జనులవి వేకపరుచు
వాణి! నీకు నే నొ రింతు వందనమ్ము .
నీదు కరుణ గల్గ మధురభా వములొల్కు
నీదు కరుణ గల్గ నేమమొందు
నీదు కరణ గల్గ నిక్కంపు పలుకబ్బు
నీదు కరుణ గల్గ నిలుతుమమ్మ
లక్ష్మిస్తుతి
నిత్యసంతుష్టులై నిగనిగలాడేటి
సంపన్నులనువిడ్చి సంయమమున
ధనవంతులుగనిల తలలునింగికియెత్తి
గర్వహితులబాసి కదము దొక్కి
ఐశ్వర్యములతోడ అలరారుతుండేటి
విలసిత మ్మొనరించు విభులవిడిచి
స్వర్గభూయిష్టమై సరసాలనిలయమౌ
కూబరులకొలువు కూటమొదిలి
నీదురాక కొరకు నిత్యతపముజేయు
వాని కరుణ జూడు వారిజాక్షి
ధనమదులను వీడి దారిద్ర్యదారుల
కదిలిరావె తల్లి కమలపీఠి
శివస్తుతి
ఆ.వె.
వెండకొండపైన వెలసిన ఓదేవ!
దండమిడెదనన్ను దయను బ్రోవు
నిన్ను నమ్మి నేను పెన్నుచేబూనితి
తొణకకుండనడుపి తోడుగుండు
నారసింహ స్తుతి
కొలదిబుద్దిగల్గ కౌతూహకముతోడ
పద్యములను రాయ పాటుపడితి
ధర్మపురమునందు దైవమై వెలసిన
నారసింహనన్ను నడుపుమయ్య
గురుస్తుతి:
అక్షరముల తోడ పదముల్లగజేసి
పదము పదము పేర్చి పద్యమల్లి
ప్రజల మన్ననంద పథముగూర్చినట్టి
గురుల పాద ములకు విరులమాల
1.
ఆక లెరుగ నోరి కన్నంబు వెట్టినా
ధనము గల్గు వాన్కి దానమొసగ
వార్థి నికురి సేటి వర్షమ్ము తీరగు
పచ్చిమట్లమాట పసిడిమూట
2.
సాహ సమున గల్గు సౌఖ్యమిం చుకెగాని
ఓర్మి నొందు సౌఖ్య ముడుగిపోదు
సహన శీలి కన్న సాహసి లలొలేడు
పచ్చిమట్లమాట పసిడిమూట
3.
సత్వ మొంది నంత సకలసి ద్ధిగలుగు
బలము గలిగి నంత ఫలము గల్గు
మనిషి సత్వ ముడుగ మాటజె ల్లుటకల్ల
ప్రాకు లాట వలదు ప్రాణి కోటి
పచ్చిమట్లమాట పసిడిమూట
4.
కత్తి వట్టి నోరు కత్తివాటుకుబోవు
కలము వట్టి నోరు ఘనత జెందు
కత్తి దార కన్న కలము దా రయెమిన్న
పచ్చిమట్లమాట పసిడిమూట
5.
దుష్ట మైత్రి వలన దుర్గతు లుగలుగు
మైత్రి తోడ మంచి బతుకు దొరుకు
కౌరవులను గూడి కర్ణుడు చెడిలేేద
అర్జునుండు వెలిగె అచ్యు తునితొ
పచ్చిమట్లమాట పసిడిమూట
6.
మాట వలన పెరుగు మమతలు బంధాలు
మాట వలన మనకు చేటు గలుగు
మనషు లాచి తూచి మాటలాడవలెను
పచ్చిమట్లమాట పసిడిమూట
7.
మాట మనిషి లోని మాలిన్య మునుతుంచు
మాట మనుషు లందు మమత బెంచు
మాట వలనె మనకు మర్యాధ ప్రాప్తించు
పచ్చిమట్లమాట పసిడిమూట
8.
మాట మధుర మైన మంచి మిత్రుల నిచ్చు
మాట కఠిన మైన మనసు విరుచు
మాట శక్తి దెలిసి మసలుకున్నమేలు
పచ్చిమట్లమాట పసిడిమూట
9.
మాటవలన మనిషి మాన్యుడయివెలుగు
మనిషి విలువ పెరుగు మాట వలన
మనిషి నుదుటి రాత మార్చేది మాటలే
పచ్చిమట్లమాట తసిడిమూట
10.
ఆ:తెలుగు వాడినెపుడు తేలిగ్గ జూడకు
పొరుగు వానికెపుడు పాలిపోడు
తాను ఘనుడె జూడు తనదైన తెన్నున
పచ్చిమట్ల మాట పసిది మూట
11.
ఆ: కాన వెదురు జూద కర్రలాగుండును
వేణు గన మదియె వెలువరించు
పరమ వెర్రి వాడు పండితుడగునురా
పచ్చిమట్ల మాట పసిడి మూట
12.
ఆ.వె.
అహము దుస్తులయ్యి తనువునంటినవేళ
అవని జనుల కంత వైరులగును
అహము తొలగె నేని ఆత్మీయు లగుదురు
పచ్చిమట్లమాట పసిడిమూట
13.
ఆ: విద్య వలన గల్గు విజ్ఞానమధికంబు
దాని సాటిరదు ధనము యెపుడు
వెలుగు రేయిరాజు వెన్నెల నిడుగా
పచ్చిమట్ల మాట పసిడి మూట
14.
ఆ: దాచి యుంచ బెరుగు ధనము రాసులుగా
పంచు చుండ బెరుగు ప్రతిభ ధనము
తోడు చుండ సెలిమ తిరిగి నిండునురా
పచ్చిమట్ల మట పసిడి మూట
15.
ఆడువారి మనసు అద్దమ్ము నిలలోన
విరిచి అతుక బూన వెర్రి తనము
తెలిసి మసలు వాడె తెలివి పరుండురా
పచ్చిమట్ల మాట పసిడి మూట
16.
మనిషి గుణము చేత మాహోన్న తుండగు
కలిమి బలిమి చేత నగుట కల్ల
ఎనుము బలిసి నంత ఏనుగె ట్లవునురా
పచ్చిమట్ల మాట పసిడి మూట
17.
మనసు లేక పుడమి మనిషి బ్రతుకదేల
సహన శీలి గాక సాధ్వి యేల
శ్వాస లేని తనువు సాధించి నదియేమి
పచ్చిమట్లమాట పసిడిమూట
18.
తరిగి పోవు వయసు కరుగుకా లమ్మిల
సమసిపోవు సకల సంప దలవి
మనల వెంట నంటు మంచి కర్మలెగాక
పచ్చిమట్ల మాట పసిడి మూట
19.
ఊర చెరువు జూడ నున్నకా డనెయుండు
చేరు గమ్య ములను బారు వాగు
చేతనత్వమున్న చేకూరు ఫలితముల్
పచ్చిమట్లమాట పసిడిమూట
20.
కాయ ముపయి దెబ్బ కాలమ్ము తోమాయు
మదిని గ్రుచ్చు మాట మాసి పోదు
వాటు కన్న మిగుల మాటలే బాధించు
పచ్చిమట్ల మాట పసిడిమూట
21.
మనిషి గుణము చేత మాహోన్న తుండగు
కలిమి బలిమి చేత నగుట కల్ల
ఎనుము బలిసి నంత ఏనుగె ట్లవునురా
పచ్చిమట్ల మాట పసిడి మూట
22.
అహమె నరుని సాంత మంత మొందించును
చెట్టు మొదలు జెరచు చెదలు తీరు
అహము వీడి వినయ మలవర్చు కొనమేలు
పచ్చిమట్లమాట పసిడిమూట
23.
కాగ డాల తోటి కాంతిబొం దగవచ్చు
కాగ డాల సృష్టి గాల్చ వచ్చు
మంచి తలపు లోనె మనుగడుం దనెరుంగు
పచ్చిమట్లమాట పసిడిమూట
24.
తల్లిదండ్రి తోటి తగవు లాడవలదు
పాద సేవ జేసి ప్రణతు లొసగు
తల్లిదండ్రి మనకు దైవసమానులు
పచ్చిమట్లమాట పసిడిమూట
25.
దాన గుణము చేత దరిజేరు జనులెల్ల
చేర దీయ కున్న దూర మగును
చెట్టు నీడ జేరి(పసులు) సేదదీ రినయట్లు
పచ్చిమట్లమాట పసిడి మూట
26.
అశ వలన మనిషి ఆయాస పడుగాకభ
తృప్తి నొంద లేడు తృష్ణ వలన
స్వర్గ సుఖము నొందు సంతృప్తి గల్గినన్
పచ్చిమట్లమాట పసిడిమూట
27.
మంచి వారి చెలిమి మర్యాద బెంచును
చెడ్డ వారి చెలిమి చేటు తెచ్చు
చెలిమి వలన గలుగు ఫలములీ లాగుండు
పచ్చిమట్లమాట పసిడిమూట
28.
అల్పు నిపను లన్ని ఆడంబ రంగుండు
గొప్పవారి పనులు గుప్త ఫలము
మహిని సత్పురుషులు మహిమల ట్లుండురా
పచ్చిమట్లమాట పసిడిమూట
29.
కోప మునను జనులు గోల్పోవు సాంతమ్ము
సర్వ సిద్ది గలుగు శాంతి తోడ
మానవాలి కంత మకుటమే సహనమ్ము
పచ్చిమట్లమాట పసిడిమూట
30.
నవ్వు విరియు మోము నరులుమె చ్చుటెగాదు
నవ్వు మోము మెచ్చు నార యణుడు
చిరునగవులె మోము చిరకాల పందమ్ము
పచ్చిమట్లమాట పసిడిమూట
31.
జ్ఞాన మెంత యున్న గానియీ జనులకు
ముక్తి కలుగ బోదు భక్తి లేక
ముక్తి నొందు గోర భక్తియే మార్గమ్ము
పచ్చిమట్లమాట పసిడిమూట
32.
దప్పి గొనిన వేళ దాహార్తినిన్ దీర్చి
ప్రేమ తోడ ముష్టి వెట్టువారు
దాత లైనిలుతురు ధరణిలో వెయ్యేండ్లు
పచ్చిమట్లమాట పసిడిమూట
33.
తల్లి దండ్రి మనకు దైవమ నియెరుగు
పాద సేవ జేసి ప్రాప్తి బొందు
అమ్మ నాన్న మించు ఆత్మీయు లింకేరి
పచ్చిమట్లమాట పసిడిమూట
34.
దప్పి గొనిన వేళ దవ్వట మదియేల
ఆక లైన వేళ వంటలేల
ముందు చూపు గలుగ మోదమొం దగలము
పచ్చిమట్లమాట పసిడిమూట
35.
వెలుగులున్న మనల వేవుర నసరించు
చీక టింట నుండ చేర రారు
ధనము జూసి బంధు జనమునీ దరిజేరు
పచ్చిమట్లమాట పసిడిమూట
36.
కొలది మాట లాడ కోరివి నియెదరు
అతిగ వాగు వార పరిహ రింత్రు
మితపుభాషనమున మెప్పుపొం దగలరు
పచ్చిమట్లమాట పసిడిమూట
37.
గెలపు కొరకు తపన గెలువగలననెడు
సంప్ర సాద నిత్య సాధ నమను
కారణాలు మూడు కార్యసా ధనముకు
పచ్చిమట్లమాట పసిడిమూట
38.
తరువు బెరుగు నిలలొ తనకు తానులతలు
తరుల సిగలు బాకి తళుకు లీను
ఆత్మ శక్తి నెదుగ కానరా దుఅహము
పచ్చిమట్లమాట పసిడిమూట
39.
అనువుగానిచోట అణిగియుండవలెను
అదును జూసి పావు కదుపవలెను
శక్తికన్నమిగుల యుక్తి ప్రధానంబు
పచ్చిమట్లమాట పసిడిమూట
40.
పండుటాకురాల పల్లవ మ్ములునవ్వు
పండు ముసలి జూచి పాప నవ్వు
ఎడ్ల వెంటె బండి నడుచున నియెరుగు
పచ్చిమట్లమాట పసిడిమూట
41.
అప్పు లధిక మైన ఆనంద నాశము
అప్పు గౌర వమ్ము లార గించు
అప్పులేని వార లదృష్ట వంతులు
పచ్చిమట్లమాట పసిడిమూట
42.
పసిడినెంత కాల్చి వంకర్లు తిప్పినా
దాని విలువ యెపుడు తగ్గబోదు
మానవత్వమున్న మనిషివి లువలాగ
పచ్చిమట్లమాట పసిడిమూట
43.
మాట విలువ బెంచు మమకార మున్ బంచు
మంచి గతులు వడయు మాట వలన
మాట తీరు కొలది మర్యాద ప్రాప్తించు
పచ్చిమట్లమాట పసిడిమూట
44.
నిరత కష్ట కడలి నీదుచుం డెడువాడు
దినది నమ్ము మిగుల తేజ మొందు
వహ్ని గాల్చు పసిడి వన్నెలొ లికినట్లు
పచ్చిమట్లమాట పసిడిమూట
45.
దరువులేని పాట చెరువులేనిదియూరు
అరుగులేని కొంప నలవి గాదు
గురువు లేని విద్య గుర్తింపు నొందునా
పచ్చిమట్లమాట పసిడిమూట
46
అంధు లైన యట్టి అజ్ఞానులంతకు
అంజ నమును బూసి కనులు తెరిచి
భావి జీవ నంపు పథముదీ ర్చుగురువు
పచ్చిమట్లమాట పసిడిమూట
47.
అప్పు మనుష జాతి ముప్పుజే యుటెగాదు
అప్పు మనల గాల్చు నిప్పు వలెను
మగడు తాను అప్పు మగవార లకునెల్ల
పచ్చిమట్లమాట పసిడిమూట
48.
చీమ చిన్నదైన చిట్టిచే తులతోడ
భువనమెత్తజూసె బుద్ది తోడ
చిట్టి చీమ కున్న చేవమనిషికేది?
పచ్చిమట్లమాట పసిడిమూట
49.
భార మెంచి తాను భయపడ కనిలిచి
గంగను తలదాల్చి అవని కంపె
భర్గు మించి నజన బాంధవు లుగలరే
పచ్చిమట్లమాట పసిడిమూట
50.
పొట్ట కూటి కొరకు పొర్లాడు బతుకులో
మాన వతను తాను మరచి నాడు
మనసు లేని వాడు మనుజుడె ట్లౌనురా
పచ్చిమట్లమాట పసిడిమూట
51
తరిగి పోవు వయసు కరుగుకా లమ్మిల
సమసిపోవు సకల సంప దలవి
మనల వెంట నంటు మంచి కర్మలెగాక
పచ్చిమట్ల మాట పసిడి మూట
52.
నీరు తగల గానె నిద్రలున్న విత్తులు
చలన శీలి యగుచు అంకురించు
జ్ఞాన మెందు టాది యజ్ఞాన ముదొలంగు
పచ్చిమట్లమాట పసిడిమూట
53.
సిరులు లేని వారి నీసడిం చుజనులు
సిరులు కూడ బెట్టి నీర్ష్య చెందు
ఏమి జేసి నప్రజ లేడ్పుమా నరుగదా
పచ్చిమట్ల మాట పసిడి మూట
54.
అవని పైవెలసిన అన్ని జీవమ్ములు
ఆయు క్రమము కొలది అంతరించు
కవి రవులిరువురిల కలకాల ముందురు
పచ్చిమట్లమాట పసిడి మూట
55.
మనిషి యెదుట నొకటి మనిషివె న్కనొకటి
మనసులోన నొకటి మాట యొకటి
మూర్ఖ మతికి నిట్లు మూతులు రెండుండు
పచ్చిమట్లమాట పసిడిమూట
56.
అంత మెపుడు లేదు మనిషికో రికలకు
తీర్చు కొలది వచ్చు తిరము గాను
నిత్య నూత నముగ నియతిభా నునితీరు
పచ్చిమట్లమాట పసిడిమూట
57.
పొట్ట కూటి కొరకు పొర్లాడు బతుకులో
మాన వతను తాను మరచి నాడు
మనసు లేని వాడు మనుజుడె ట్లౌనురా
పచ్చిమట్లమాట పసిడిమూట
58.
అగ్ని నార్పు టకును సలిలంబు గాకుండ
యుత్త మంబు నైన దుర్వి గలదె
కోప మార్పు టకును ఓర్పుమిం చినదేమి
పచ్చిమట్లమాట పసిడిమూట
59.
ఊర చెరువు జూడ నున్నకా డనెయుండు
చేరు గమ్య ములను బారు వాగు
చేతనత్వమున్న చేకూరు ఫలితముల్
పచ్చిమట్లమాట పసిడిమూట
60.
అవని పైవెలసిన అన్ని జీవమ్ములు
ఆయు క్రమము కొలది అంతరించు
కవి రవులిరువురిల కలకాల ముందురు
పచ్చిమట్లమాట పసిడి మూట
61.
సాహ సమున గల్గు సౌఖ్యమిం చుకెగాని
ఓర్మి గల్గు సౌఖ్య ముడుగ వశమె
సహన శీలి కన్న సాహసిం కనులేడు
పచ్చిమట్లమాట పసిడిమూట
62.
సత్వ మొంది నంత సకలసి ద్ధిగలుగు
బలము గలిగి నంత ఫలము గల్గు
మనిషి సత్వ ముడుగ మాటజె ల్లుటకల్ల
ప్రాకు లాట వలదు ప్రాణి కోటి
పచ్చిమట్లమాట పసిడిమూట
64.
దుష్ట మైత్రి వలన దుర్గతు లుకలుగు
మైత్రి తోడ మంచి బతుకు దొరుకు
కౌరవులను గూడి కర్ణుడు చెడిపోయె
అర్జునుండు వెలిగె అచ్యు తునితొ
పచ్చిమట్లమాట పసిడిమూట
65.
సుతులుగల్గు వారు గతులవడ్తురుగాని
సుతులు లేని యెడల గతులులేవు
సుతులగతుల నవని స్రుష్టించినదెవరో
పచ్చిమట్లమాట పసిడిమూట
66.
సంప దెంతొ యుండి సంతృప్తి లేకున్న
నరక ప్రాయ మౌను నరుని బ్రతుకు
సంపద లవి యేవి సంతృప్తి నిన్మించి
పచ్చిమట్ల మాట పసిడిమూట
67.
సిరులు లేని వారి నీసడిం చుజనులు
సిరులు కూడ బెట్టి నీర్ష్య చెందు
ఏమి జేసి నప్రజ లేడ్పుమా నరుగదా
పచ్చిమట్ల మాట పసిడి మూట
68.
అవని పైవెలసిన అన్ని జీవమ్ములు
ఆయు క్రమము కొలది అంతరించు
కవి రవులిరువురిల కలకాల ముందురు
పచ్చిమట్లమాట పసిడి మూట
69.
అలతి యలతి తెలుగు పలుకులన్నిటినేరి
కవితలల్లినట్టి కవుల ఘనులు
వారి వలనె తెలుగు వర్ధిల్లుచున్నది
పచ్చిమట్ల మాట పసిడిమూట
70.
ధనము యెంత వున్న దానంబు సేయకా
దాచి యుంచు వాడు దాతగాడు
విద్య కలిగి యుంటె విద్వాంసుడవడురా
పచ్చిమట్ల మాట పసిడి మూట
71.
ఎదుటివారిమనసు నెగులువెట్టగరాదు
ఈప్సితమ్ము దెలిసి మెలగవలయు
పరుల తృప్తి బరుచ పరతత్వ మందును
పచ్చిమట్ల మాట పసిడిమూట
72.
చీమ పగలుగుట్టి చీకాకు కలిగించు
దోమ రేయిగుట్టి దురదలేపు
భార్య గుట్టుచుండు పగలురేయనకుండ
పచ్చిమట్లమాట పసిడిమూట
73.
కలిమిగల్గునాడు కులముగల్గునుగాని
కలిమిలేనియెడల కులములేదు
తావిలేనిపూల తలదాల్చరెవ్వరు
పచ్చిమట్లమాట పసిడిమూట
74.
కోపమడచనేని గొప్పకీర్తి గలుగు
కొపముడుగినమది కుదుటపడును
పాముకూసమిడిచి ప్రశాంతతనొందు
పచ్చిమట్లమాట పసిడిమూట
75.
సత్పురుషుల పొత్తు సచ్చీలమొనగూర్చు
సకలజనులుమెచ్చు సౌఖ్యమిచ్చు
పాలుదేనెగలువ పదిమంది మెచ్చుదురు
పచ్చిమట్లమాట పసిడిమూట
76.
నీరుపాలుగలిసి యేరులయ్యినతీరు
మంచిచెడులు రెండు మహిని గలవు
హంసలోలె జనులు అరసిగ్రోలగవలెను
పచ్చిమట్లమాట పసిడిమూట
77.
కారునలుపురంగు గానచ్చు కోకిల
గొంతువినిన మనసు గంతులేయు
నలుపుమీద గెలుపునందించునదిమాట
పచ్చిమట్లమాట పసిడిమూట
78.
కాకి కోకిలములు కారున్నల్లగనుండు
పలుకుచేత వని ప్రతిభదెలియు
వన్నెకన్న మిగుల వాసియౌ గుణములు
పచ్చిమట్లమాట పసిడిమూట
79.
అధికులధరిజేరి అందలమ్ములనెక్కి
అలతిజేయవలదు సాటిజనుల
సూదిజేసెడుపని సురకత్తి జేయునా
పచ్చిమట్లమాట పసిడిమూట
80.
ప్రజలుజేసినట్టి పాపపుణ్యఫలము
వేగనరుగుచుండు వెంటనంటి
ఎడ్లవెంట ముడ్లు వేళ్ళవెంబడిచాళ్ళు
పచ్చిమట్లమాట పసిడిమూట
81.
నిండుకుండలెపుడు నిలకడగానుండు
నీరువెలతి కుండ దొరలుచుండు
అవని యధికుదల్పు డారీతినుందురు
పచ్చిమట్లమాట పసిడిమూట
82.
పక్షులాకసమున పయనించు మార్గమ్ము
నీటిలోన మీనమీదు ద్రోవ
జ్ఞానిమార్గమోలె అజ్ఞాతమైయుండు
పచ్చిమట్లమాట పసిడిమూట
83.
సిరులులేని వారలనీసడించు జనులు
సిరులుగూడబెట్టి నీర్షజెందు
ఎమిజెసిన జనులేడ్పుమానరుగద
పచ్చిమట్లమాట పసిడిమూట
84.
వీహరించు నరుడు విహగమై గగనాన
నీటిలోన యీదుచేపలాగ
మనిషిలాగ ధరణి మనలేడు మనలేడు
పచ్చిమట్లమాట పసిడిమూట
85.
రాతి విగ్రహంలను ప్రీతితో సేవించు
పూలుఫలములొసగి పూజసేయు
సాటిమనిషియెడల పాటిదప్పిరిగదా
పచ్చిమట్లమాట పసిడిమూట
86.
ఎవరితరముగాదు యినుమునాశముజేయ
తుప్పువలనెయినుము ముప్పునొందు
నరులయహమెతమను నాశనమ్మొనరించు
పచ్చిమట్లమాట పసిడిమూట
87.
ఎదుగుకొలది యిడుములెక్కువౌ జగతిలొ
యెవరితరము గాదు నిలువరించ
మంచుకొండగూడ మండుటెండలమాడు
పచ్చిమట్లమాట పసిడిమూట
88.
గుడియుగల్గెనేని గురుతరమౌభక్తి
బడియుగల్గెనేని భవిత దక్కు
చెరువులున్నయూర కరువేల దరిజేరు
పచ్చిమట్లమాట పసిడిమూట
89.
అలతియలతి పలుకులన్నిటినేరి
కవితలల్లినట్టి కవులుఘనులు
వారివలెనె తెల్గు వర్ధిల్లుచుండును
పచ్చిమట్లమాట పసిడిమూట
90.
ధనమదెంతగల్గ దానంఉ సేయక
దాచియుంచువాడు దాతగాడు
విద్యబంచనోడు(కుండ) విద్వాంసుడవ్వడు
పచ్చిమట్లమాట పసిడిమూట
91.
ఆడువారి మనము యద్దమ్మువలెనుండు
విరిచియతుకబూన వెర్రితనము
మగువ మనసుదెలిసి మసలువాడె మనిషి
పచ్చిమట్లమాట పసిడిమూట
92.
చంద్రుడెవరికొరకు జగతి వెన్నెలబంచు
అభ్రమెవరికొరకు యంభువిచ్చు
సత్పురుషులొసంగు స్వార్థమించుకలేక
పచ్చిమట్లమాట పసిడిమూట
93.
ధనమునాశ విడిచి దాతలౌదురుజనుల్
మోహమిడిచినంత మోక్షమొందు
స్వార్థ చింతనవీడ సత్పుర్షులౌదురు
పచ్చిమట్లమాట పసిడిమూట
94.
సుద్దుజెప్పదమతి సులభకార్యముగాని
ఆచరించనదియె కష్టతరము
చెప్పువారు దాని జేసిచూపినమేలు
పచ్చిమట్లమాట పసిడిమూట
95.
ఆశయమ్ము కొరకు అహమురాత్రులనక
పట్టుబట్టి పాటుపడగవలెను
ఆశయమ్ముదీర ఆత్మతృప్తిగలుగు
పచ్చిమట్లమాట పసిడిమూట
96.
అవసరమ్మునెరిగి యాదుకొననివాడు
ఆస్తిపరుడయినను నాస్తిఫలము
ఆకలణచలేని ఐశ్వర్యమదియేల
పచ్చిమట్లమాట పసిడిమూట
97.
మనసు మెచ్చెనంటు మంచిచెడులురెండు
ఆచరించుటెల్ల సబబుగాదు
ఆచరించువేల తరచి చూసినమేలు
పచ్చిమట్లమాట పసిడిమూట
98.
పాపహరణజేయ పయనించుగంగమ్మ
పతనమయ్యితినని బధపడదు
జగతి శుభముగూర్చు జనవర్తనమిటుల
పచ్చిమట్లమాట పసిడిమూట
99.
నిరుపయోగమౌను నిండు సంద్రపునీరు
ఊరబావినీరు దూపదీర్చు
సంపదుండినంత సద్భుద్దులుండునా
పచ్చిమట్లమాట పసిడిమూట
100.
మంచి గునముచేత మాన్యులౌదురుగాని
వేషధారణమున విలువరాదు
చీరమారినంత శీలమ్ముమారునా
పచ్చిమట్లమాట పసిడిమూట
101.
పరుల దోషములను పలుమారు లెక్కించు
ఖలుడు తనదు తప్పు గాంచలేడు
గుర్తెరుగడు నలుపు గురివినంద గింజోలె
పచ్చిమట్లమాట పసిడిమూట
102.
పాతళముని గంగ పైకి తీయగవచ్చు
లెక్కపెట్టవచ్చు చుక్కలన్ని
మగువమదిని గెలువ మగనితరముగాదు
పచ్చిమట్లమాట పసిడిమూట
103.
ముళ్ళమీద నడిచి వెళ్ళవచ్చునుగాక
పదునుకత్తినదిమి పట్టవచ్చు
ఖలుని చిత్తమార్చ కాదెవ్వరితరము
పచ్చిమట్లమాట పసిడిమూట
104.
స్వాభమున జనులు సర్వాధిపతియౌను
గద్దెనెక్కరాదు పెద్దరికము
కాకి శిఖరమెక్కి గరుడుగానేరదు
పచ్చిమట్లమాట పసిడిమూట
105.
ధనముతోడ కడు ధాన్య రాశుల్యున్న
మణులగిరులు ఆలమందలున్న
సకలశూన్యములగు సద్భుద్ధిలేకున్న
పచ్చిమట్లమాట పసిడిమూట
106.
నింగి వెలుగులీను సింగిడి విరబూసి
రంగవల్లితోడ ముంగిలెలుగు
ఆడపిల్లలుండ ఆలయమ్మువెలుగు
పచ్చిమట్లమాట పసిడిమూట
107.
కండబలముజూసి గర్వపడగరాదు
సిరులుజూసిపొంగి పొరలరాదు
కలిమి బలములనెవి గావుశాశ్వతములు
పచ్చిమట్లమాట పసిడిమూట
108.
పెంచినట్టి తరులు పంచియిచ్చునునీడ
పాడియావుబెంచ పాలనిచ్చు
తనరిపుత్రులబెంచ తానేమియిచ్చురా
పచ్చిమట్లమాట పసిడిమూట
109.
ధనముద్రవ్యములవి ధరనశాశ్వతమని
యెరుగలేడునరుడు యరుగువరకు
చిన్నకిటుకుదెలువ చిరకీర్తులందేరు
పచ్చిమట్లమాట పసిడిమూట
110.
బ్రతికియున్ననాటి పాపపుణ్యఫలము
మరణప్రాప్తిపిదప వరములగును
అదియెరుగని నరులు అధ్వాహ్నమౌతుంద్రు
పచ్చిమట్లమాట పసిడిమూట
111.
ఆలు చదువుకున్న ఆలయమ్మువెలుగు
ఆడవారుచదువ నవనివెలుగు
దీపమున్నయింట చీకటేలుండురా
పచ్చిమట్లమాట పసిడిమూట
112.
తరులగాచు ఫలము తానందరికిబంచు
ఊటబావినీరు యూరకిచ్చు
విద్యజగతిబంచు విద్వాంసుడాతీరు
(గురులు విద్యబంచు వరశిష్యులంతకు)
పచ్చిమట్లమాట పసిడిమూట
113.
ఒక్కమొక్క కోటిమొక్కల మొలిపించు
దివ్వెతోటి కోటిదివ్వెలెలుగు
సంఘమంతదీర్చు సత్పురుషుడీతీరు
పచ్చిమట్లమాట పసిడిమూట
114.
అగ్గిపుల్లచేత అంధకారముబాయు
అగ్గిపుల్లచేతె యవనిగాలు
అగ్గిపుల్లతీరు శాస్త్రముపకరించు
పచ్చిమట్లమాట పసిడిమూట
115.
చావుఫుట్టువులిల సాధారణమనక
బంధనముల జనులు బ్రతుకుతుండ్రు
మోహమొకటివీడ మోక్షమ్ము ప్రాప్తించు
116.
అహమువిడిచినంత యధికార మబ్బును
వినయమార్గమందు విజయమబ్బు
సహన మొక్కటుండ సర్వమబ్బునుగదా
పచ్చిమట్లమాట పసిడిమూట
కాంతి గలిగినేళ గన్పట్టు తనుఛాయ
వెలుగు సమసి పోవ మలిగి పోవు
అక్కెరున్నవేళ ఆప్తులచ్చినటుల
పచ్చిమట్లమాట పసిడిమూట
భాస్కరుండు పతిగ ప్రకశించి నవ్వేళ
పడతి కమల మయ్యి పళ్లవించు
భార్యభర్తబంధ మారీతి నుండాలె
పచ్చిమట్లమాట పసిడిమూట
ధనముగల్గినంత తగినగౌరవమొందుధ
నములేక విలువ దక్కబోదు
నీరులేనిబావి నెవరాశ్రయించరు
పచ్చిమట్లమాట పసిడిమూట