నామనసే పూదోటై పరిమళించె నీరాకతొ
నాబతుకే సెలయేరై పరవళించె నీరాకతొ
కల్పనవో కలరూపమొ కావ్యమందు కన్యకవో
కలలన్నీ మధురమయ్యి పరవశించె నీరాకతొ
సురకన్యవొ వరవీణవొ దరహాసపు దొరసానివొ
నామదితెర చందురుడై ఊరడించె నీరాకతొ
కొమ్మతనువు లేగొమ్మవొ బాపుచేతి చిత్రాంగివో
యెదముంగిలి బొమ్మకొలువు తారసించె నీరాకతొ
వాకమువో వాగునువో నింగిజారు సెలయేరువొ
ఆనందము సాకరమయి పల్లవించె నీరాకతొ
No comments:
Post a Comment