Tuesday, December 6, 2016

నీ లోని నేను

అనునిత్యంం నీ జ్ఞాపకాల
అలలపైై ఓలలాడుతుంంటాను
నీలోని ప్రశాంంతతను
నింండార వీక్షిస్తూ నిరీక్షిస్తుంంటాను
        నదిలా హొయలొలుకుతూ
        నింంపాదిగా సాగే నీ గమనానికి
       అడ్డుపడిన గుంండునయి నిలిచి
      నీలోని గలగలలు వెలికి తీస్తుంంటాను
మౌౌనాలంంకారపు నీ వదనంంలో
చిరుదరహాసంం చిగురింంపజేస్తాను
స్నేహానికి చేయంందింంచి
ఆప్యాయతకుఆలవాలమైై
నీ ఊహలకు ఊతమిచ్చి
విహంంగమైై విహరింంప జేస్తాను

No comments: