Tuesday, December 20, 2016

పు(తి)రోగమనం

జీవారణ్యంంలో
మనిషి పశువుగా నున్నపుడు
ప్రతిప్రాణిలో దైైవత్వంం
ప్రకృృతంంతా పచ్చదనంం
సకల జీవుల సాహచర్యంం
సుఖజీవన సుంందర దృృశ్యంం
సకల చరాచర జీవుల
సమిష్టి జీవన సౌౌంందర్యంం  !

పశువు మనిషిగ పరిణమింంచి
మేథస్సుకు పదునుపెట్టి
భోగలాలస పరుంండైై
ఆనంందపు జీవనపుటలలపైై ఓలలాడుతూ
రాజీపడని రాజసంంతో
వెన్నుచూపని వీరులయి
స్వార్థ పరతయే పరమావధిగా
సకల జీవుల నెలవులయిన
వనాలు నరికి భవనాలు నిర్మింంచి
అభివృధ్ధి అదియేనని
ఆనందపడుతుండు
ఆధునిక మనిషి  !

చెరువుల కుంంటల చెర విడిపింంచి
ఆయకట్టులను ఆక్రమింంచి
కాలుష్యపు కార్ఖానాలు
ఆకాశ హర్మ్యాలు నిర్మింంచి
తన మేథస్సుకు సాటిలేదని
మురిసిపోతుండు మూర్ఖపు మనిషి !

నీటి నిలువలకాధారమైై
నిజమైైన ప్రకృృతి భాంండాగారమైై
జగతికంండగ నిలిచే కొంండల
యంంత్రపు శక్తితో ఆసాంంతంం పేల్చి
నీటినిలువలు పాతరవేసి
కోటీశ్వరులయి కులికే మనిషి
అమూల్యమైైన అమృృతదారకు
ప్రాణవాయువు మూల్యమునెరుగక
మూర్ఖపు ఆలోచనతో ముంందడుగేస్తూ
ప్రకృృతిని పాతరవేసే
అభివృృధ్ధికి అర్థమేమి
నేలవిడిచి సాము చేసి
నిలువలేమని యెరుగక
తను కూర్చున్న తరువు కొమ్మను
తనే తెగ నరుక్కుంటూ
కరువుకాటకాలన్నింటికి
కారణం తానని గుర్తించని
అమాయకత్వమే పురోగమనమా
పురోగమనంం తిలోదలకాలిస్తూ
చేసే తిరోగమన ప్రయత్నమే !

                 -పచ్చిమట్ల రాజశేఖర్
                  తెలుగు లెక్చరర్


No comments: