Wednesday, December 14, 2016

మరల రానిది

నీటిలోని అలలైై
నిరంంతరంం కదలాడుతూ
నింంగిలోని తారలైై
మిణుగురులైై తళుకులీనుతూ
అనునిత్యంం ఆనంందోత్సాహంంతో
హాయిగా నవ్వుకునే
నిష్కాపట్యపుహృృదయంం
నిర్మల జీవన మచ్చుతునక బాల్యంం

నిరంంతర చేష్టలతో
నిరాటంంకపు ఆటపాటలతో
అంందరికి హాయిని పంంచే
ఆ బాల్యంం అపురూపంం

పొద్దువొడిసినప్పటినుంంచి
పొద్దుగూకేదాక
అలుపెరుగక ఆటలాడి
సేదబాయికాడ జేరి
బుడ బుడ తానంంజేసి
బువ్వ దిని
ఆదమరచి హాయిగ నిద్రింంచే
ఆ బాల్యంం అమోఘంం

తోటివారితోని తోబుట్టువులతోని
ఆటపాటల మాటున
ఆలోచనలకు పదునుపెట్టి
అంంతర్గత కౌౌశలాల
నప్రయత్నంంగ వెలికి తీసి
భావి జీవితానికి బాటలు వేసిన
ఆ బాల్యంం అనిర్వచనీయంం

దాగుడు మూతలలోన దాగిన వెతుకులాట
గురిజూసి గోటిని కొట్టడంంలోని ఏకాగ్రత
చింంతచెట్టు కింంద చిర్రగోనె జోకుడు
చిన్న చిన్న కొమ్మలెక్కి కోతికొమ్మ లాడుడు
మోటబాయిల మునిగి కోడిపుంంజు లాడుడు
చిన్న చిన్న ఆటలల్ల చిత్రమైైన కౌౌశలాలు
ఏగురువు నేర్పలేనివి!
ఎన్నటికీ మరువలేనివి!

అవ్వ నెడబాసిన ప్పటి నుంండి
అన్న చేయివట్టి బడికోయె దాక
సోపతిగాల్లతోని
అల్లరిఅరుపుల ఝరులైై
చిరునవ్వుల నెలవులైై
ఆనంందానికి ఆలవాలమైై
అమృృతానుభూతులు నింంపిన
ఆనాటి ఆ బాల్యంం
         మరువలేనిది
         మరల రానిది

               

సన్నజాజి

Wednesday, December 14, 2016
మరల రానిది
నీటిలోని అలలైై
నిరంంతరం కదలాడుతూ
నింంగిలోని తారలైై
మిణుగురులైై తళుకులీనుతూ
అనునిత్యం ఆనంందోత్సాహంతో
హాయిగా నవ్వుకునే
నిష్కాపట్యపుహృదయం
నిర్మల జీవన మచ్చుతునక బాల్యం!

నిరంంతర చేష్టలతో
నిరాటంకపు ఆటపాటలతో
అంందరికి హాయిని పంచే
ఆ బాల్యంం అపురూపం!

పొద్దువొడిసినప్పటినుంచి
పొద్దుగూకేదాక
అలుపెరుగక ఆటలాడి
సాదబాయిమీద బొక్కెన్లానీళ్లుజేది
బుడ బుడ తానంజేసి
బువ్వ దిని
ఆదమరచి హాయిగ నిద్రించే
ఆ బాల్యం అమోఘం!

తోటివారితోని తోబుట్టువులతోని
ఆటపాటల మాటున
ఆలోచనలకు పదునుపెట్టి
అంంతర్గత కౌశలాల
నప్రయత్నంగ వెలికి తీసి
భావి జీవితానికి బాటలు వేసిన
ఆ బాల్యం అనిర్వచనీయం!

దాగుడు మూతలలో దాగిన వెతుకులాట
గురిజూసి గోటిని కొట్టడంలోని ఏకాగ్రత
చింతచెట్టు కింద చిర్రగోనె జోకుడు
చిన్న చిన్న కొమ్మలెక్కి కోతికొమ్మ లాడుడు
మోటబాయిల మునిగి కోడిపుంజు లాడుడు
చిన్న చిన్న ఆటలల్ల చిత్రమైైన కౌశలాలు
ఏగురువు నేర్పలేనివి!
ఎన్నటికీ మరువలేనివి!

అవ్వ నెడబాసిన ప్పటి నుండి
అన్న చేయివట్టి బడికోయె దాక
సోపతిగాల్లతోని
అల్లరిఅరుపుల ఝరులైై
చిరునవ్వుల నెలవులైై
ఆనంందానికి ఆలవాలమై
అమృతానుభూతులు నింపిన
ఆనాటి ఆ బాల్యం
         మరువలేనిది
         మరల రానిది

               
రాజశేఖర్ at 10:09 PM

No comments: