సింగిడి రంగుల హోళీ
బంగరు హంగుల కేళీ॥2॥
సప్తవర్ణముల సమరసభావన మదిలోమెరిసే కోలాహలీ కామునికేళీ హోళీ మన్మథబాణము హోళీ
చ1:
అగ్గిరవ్వల మోదుగుపూవులు అందించెనులే కాషాయమ్మును
మిలమిల మెరిసే మల్లెలుమొల్లలు
మనకిచ్చినవీ తెల్లనిరంగును
ముద్దుగవిరిసిన మందారమ్ములు
అందించినవీ అరుణవర్ణమును
అన్నిరంగులూ కలిసినహోళీ ఆనందాలు మొలిసిన కేళీ
చ2:
నల్లని ఆకాశమ్మందించిన నలుపువర్ణమేహోళీ
కమ్మనిరాగాలాలపించేటి పిల్లతెమ్మెరలె హోళీ
పచ్చనిపైరులు ప్రేమగనిచ్చిన హరితవర్ణమే హోళీ
చెంగున గెంతే లేగలమూతికి
పాలనురగలే హోళీ
చ3:
వెన్నెల వెలుగులు హోళీ
బంగరు సంధ్యలు హోళీ ॥2॥
నింగిల మేఘపు నీలివర్ణమై
తొంగిచూసినది హోళీ
చ4:
బంతుల పసుపే హోళీ
కెందామరలే హోళీ॥2॥
రాగరంజితపు రమ్యోద్యానము
విరిసిన సిరులే హోళీ రంగులమయమీ కేళీ ॥2॥
No comments:
Post a Comment