రాణిరుద్రమ తీరు రయమున సాగేటి
హయమునెక్కగలదు భయములేక
లక్ష్మిబాయమ్మోలె లక్షణముగతాను
అశ్వమెక్కగలదు అలుపులేక
సత్యభామయితాను సమరమందుననిల్చి
అసురమర్ధనజేయు
నాజియందు
ప్రాచీన పడతుల ప్రతిభదెల్సినతాను
పయనమయ్యెప్రగతి పథమునందు
ఆధునికపడతి అవరోధ ములుదాటి
సుతువీపు గట్టుక ఛోద్యముగను
చరితగతిన నాటి చతురతెరిగితాను
సంబుర మునసాగె సైకిలెక్కి
పచ్చిమట్ల రాజశేఖర్
No comments:
Post a Comment