Friday, March 17, 2023

ప్రకృతి పాట

 

నింగి కురిసిందీ నేల మురిసిందీ

నింగినేలా మేటి కలయిక పైరై విరిసిందీ పుఢమి మెరిసిందీ ॥నింగి॥


చ1:

సెలయేటి అలల సవ్వడులువిని సేను మురిసిందీ

పారే వాగు హొయలు చూసి పైరు మురిసిందీ

పొంగే పాలదార జూసి పాడి మురిసిందీ

చెంగునగెంతే లేగను జూసి ఆవు మురిసిందీ అంబాని అరిసిందీ 


చ2

ఎగిసే సంద్రపు అలలను చూసి నింగి మురిసిందీ

మండేయెండలతాపం జూసి మబ్బు మురిసింది

శిరముగురిసే మంచుబిందుల తరువు మురిసిందీ

మారే ఋతువుల రంగు జూసి ప్రకృతి మురిసిందీ

ఫలమై వెలిసిందీ

No comments: