గతమంత నీజగతి ఘనకీర్తులందించి
గగనాంతరాళకు గమనమందె
మధురభావమ్ముల మదిలోతు లోనిల్పి
వినువీధి కేగెను మునుసటేడు
ఆత్మీయ భావాల కాలంభ నైతాను
అనుభూతు లుమిగిల్చి యరిగిపోయె
విజయ పరంపర విశ్వాని కందించి
జయజయ ధ్వానాల సాగిపోయె
అట్టి వత్సరమున కాత్మీయ వీడ్కోల
సాగనంపరయ్య సకల జనులు
సకలశుభాలను సమకొల్ప జగతికి
కొత్త సాలు వచ్చె కోర్కెతోడ
No comments:
Post a Comment