Saturday, February 27, 2021

మనిషి మనసు (కైతికాలు)


యెదుటివాని యెదుగుదలను

వోర్వలేవు యెందుకనీ?

పరులబాగు పరికించగ

పొరలుతావు యెందుకనీ?

ఓమనసా! యీతలపుల

కుములుతావు యెందుకనీ? -93


ఉన్నంతనె తృప్తినొంది

యూరుకోవు దేనికనీ?

లేనిదాని కొరకు వెంట

నరుగుతావు దేనికనీ

ఓమనసా! నీపరుగులు

ఆపవింక దేనికనీ? -94


చుట్టుజనం జూసినువ్వు

యోధుడవని యనుకోకూ

నీసత్తువ దెలియకుండ

సకిలించా లనుకోకూ

ఓమనిషీ! తలచినంత

దరిచేరాలనుకోకూ -95


ఎదిరిశక్తి నెంచకుండ

పోరివిజయ మొందలేవు

నిన్నునీవు గాంచకుండ

మహనీయత నొందలేవు

ఓమనిషీ! ఆశరేగి

నీవు ముక్తి నొందలేవు -96


101 - 104

No comments: