గూడుజూసిన కొలది గమ్మత్తుగుందీ
హంగులన్నీయమరి అందమ్ముగుందీ ॥2॥
షాజహానిచ్చినా తాజుమహలునుమించు
మయుడు తాగట్టినా మయసభనుమించు
తూగుజూసిన యెడద తేలియాడుతుండు
యేశత్రువుల బెడద దరిచేరకుండు ॥గూడు॥
ఈనెలేరీతెచ్చి యిల్లునిర్మించేవు
పరకలేరుకచ్చి పరుపుగూర్చేవు
ఈతచెట్టూకొమ్మ నూతమ్ముగాగొని
బంగారుగూడును తూగగట్టేవు ॥గూడు॥
ఇంజనేరులకెంత వొంటబట్టునొగాని
నీగూటినిగనిగల నివ్వెరలు బోయేరు
మేథావులయినట్టి యీమానవులంత
తూగుటుయ్యెల జూచి తలచిమురిసేరు ॥గూడు॥
అరలుఅరలుగ నీవుకొరతలేకుండా
గూడుగట్టికూనల సాకుతుండేవు
నిపుణత నీకేల నిజముజెప్పమ్మా
గురువెవ్వరో నీకు గుట్టువిప్పమ్మా
తట్టలల్లేవారు బుట్టలల్లేవారు
నీపనితనం జూసి పరవశించేరు
నీగూడు మించిన నీడలేదోయీ
ఈసృష్టి నీవంటి శిల్పి లేరోయీ ॥ గూడు॥
No comments:
Post a Comment