వికసించే చంద్రునిలో చల్లని నీనవ్వున్నది
వినిపించే సవ్వడిలో తియ్యని నీపిలుపున్నది
వలపువాన కురియువేళ చెలిజాబిలి నీవేగా
అలలుపొంగే నాహృదిలో వెచ్చని నీచెలిమున్నది
ఆకాశపుసరసు నడుమ ఆశలతామర నీవే
కదలాడెడు కనులవెనుక కమ్మని నీరూపున్నది
నీతొలకరిముద్దుకొరకు చెలగు చకోరము నేనే
తేలియాడు మబ్బులలో తెల్లని నీమనసున్నది
నీవెచ్చని నిట్టూర్పులు తాకెను శేఖరు చెక్కిలి
నాగమ్యపు దారులలో వెయ్యని నీయడుగున్నది
No comments:
Post a Comment