Saturday, February 27, 2021

మనిషి మనసు (కైతికాలు)


యెదుటివాని యెదుగుదలను

వోర్వలేవు యెందుకనీ?

పరులబాగు పరికించగ

పొరలుతావు యెందుకనీ?

ఓమనసా! యీతలపుల

కుములుతావు యెందుకనీ? -93


ఉన్నంతనె తృప్తినొంది

యూరుకోవు దేనికనీ?

లేనిదాని కొరకు వెంట

నరుగుతావు దేనికనీ

ఓమనసా! నీపరుగులు

ఆపవింక దేనికనీ? -94


చుట్టుజనం జూసినువ్వు

యోధుడవని యనుకోకూ

నీసత్తువ దెలియకుండ

సకిలించా లనుకోకూ

ఓమనిషీ! తలచినంత

దరిచేరాలనుకోకూ -95


ఎదిరిశక్తి నెంచకుండ

పోరివిజయ మొందలేవు

నిన్నునీవు గాంచకుండ

మహనీయత నొందలేవు

ఓమనిషీ! ఆశరేగి

నీవు ముక్తి నొందలేవు -96


101 - 104

గిజిగాని గూడు (గేయం)

 గూడుజూసిన కొలది గమ్మత్తుగుందీ

హంగులన్నీయమరి అందమ్ముగుందీ  ॥2॥

షాజహానిచ్చినా తాజుమహలునుమించు

మయుడు తాగట్టినా మయసభనుమించు

తూగుజూసిన యెడద తేలియాడుతుండు

యేశత్రువుల బెడద దరిచేరకుండు    ॥గూడు॥


ఈనెలేరీతెచ్చి యిల్లునిర్మించేవు

పరకలేరుకచ్చి పరుపుగూర్చేవు

ఈతచెట్టూకొమ్మ నూతమ్ముగాగొని

బంగారుగూడును తూగగట్టేవు   ॥గూడు॥


ఇంజనేరులకెంత వొంటబట్టునొగాని

నీగూటినిగనిగల నివ్వెరలు బోయేరు

మేథావులయినట్టి యీమానవులంత

తూగుటుయ్యెల జూచి తలచిమురిసేరు ॥గూడు॥


అరలుఅరలుగ  నీవుకొరతలేకుండా

గూడుగట్టికూనల సాకుతుండేవు

నిపుణత నీకేల నిజముజెప్పమ్మా

గురువెవ్వరో నీకు గుట్టువిప్పమ్మా


తట్టలల్లేవారు బుట్టలల్లేవారు

నీపనితనం జూసి పరవశించేరు

నీగూడు మించిన నీడలేదోయీ

ఈసృష్టి నీవంటి శిల్పి లేరోయీ  ॥ గూడు॥

Wednesday, February 17, 2021

శీర్షిక:దొడ్డ మనసు బాల్యం


అంగవైకల్యంతో కుములుతున్న నేస్తానికి ఆలంభనయ్యింది బాల్యం


వైకల్యపు దేహానికి మనోధైర్యాన్నిచ్చి నిటారుగ నిలిపింది బాల్యం


ఆత్మన్యూనతకు ఆలవాలమైన వైకల్యం విస్తుపోయేలా


అవిటితనాన్ని అంటగట్టుకొని స్నేహానికి చేయూతనిచ్చింది తోటిబాల్యం

Saturday, February 13, 2021

పొగసూరిన బాల్యం

 

బడిబందయిన్నాటినుండి

కాళ్లకు సంకెకళ్లేసినట్టు

బాల్యం బంధీఅయ్యింది బందెలదొడ్డిల


లేలేత చేతుల విరిసిన నగుమోముతో

పండువెన్నెల సందమామసొంటి

బాల్యం  పొగసూరుతుంది పల్లెల్లో!


బతుకు భారమైన సంసారసారథికి

చేతనైన సాయంతో చేయూతనిస్తూ 

నిగనిగలబాల్యం వసివాడిపోతున్నది!

ఆడిపాడుతూ ఆటగోరే పిల్లలు

పత్తిసేన్లల్ల పట్టనపలిగిన

పత్తికాయోలె నవ్వుతున్నరు!


విరిసే గులాబీలు కరువుసాలెగూటిలో

మొగ్గలుగానే ముకులించుకుపోతున్నది బాల్యం

గమ్యపు దారులు వెదుకలేక

గతిదప్పిన బాల్యం

బర్లకాడ గొర్లకాడ కట్టెకావలై బిగుసుకుపోయింది!

కమ్మరి కొలిమిల నిప్పురవ్వలై

సెగలుగక్కుతూ పనిముట్లకు పదునువెడ్తుంది 

కుమ్మరాముల సగంగాలిన 

కుండలయి కూలవడుతున్నది బాల్యం!


ఇటుకబట్టీల యినుపకంచెలు దాటలేక

మట్టికొట్టుకపోతున్నది

ఎంగిలి కప్పులు కడుగలేక

యెదల మదనవడుతున్నది బాల్యం!


చినిగిన గుడ్ఢలు అరిగిన సెప్పులు

కమిలిన సేతులు కాలేకడుపులతో

కలవరపడుతున్నది బాల్యం!


బలపంతో బతుకుదిద్దుకునే 

లేలేతచేతుల బాల్యం

సేన్లల్ల సెల్కలల్ల కందిపోతున్నది!

పసులకొట్టాల్లో

 ఇసిరేయబడి కంపుగొడుతున్నది

నవనీత సుకుమార  బతుకులు

బండసరుసుకపోతున్నయి!


తరాలు మారినా

తలరాతలు మారలే

ప్రభుత్వాలు మారినా

పాలకులు మారినా

తీరుమారని తీయనిబాల్యం

నిరాదరణకు గురవుతున్నది

అంతరాలు పెరిగిపెరిగి

నక్కకు నాగలోకముతీరు

పేదోని ఆకలిదీరేదెప్పుడు?

పసితనానికి బరోసాయెప్పుడు?

బుడిబుడి యడుగుల బాల్యానికి

బడిచేరువయ్యేదెపుడు?

తోటకూర కట్టలై వాడుతున్న బాల్యానికి

పనుల విముక్తెన్నడు?

పసిడికాంతుల బాల్యం

సీతాకోకలై విహరించేదెన్నాళ్లకు?


Sunday, February 7, 2021

చిత్రం - పద్యం (సీసం)




1.కురులన్ని విరబూసి హరివిల్లు గాజేసి         
చెలియ తా నేగెనో చెరువు దరకు
2కుండసం కనబెట్టి కోమలొ య్యారియై
పడుచుత నముబెంచ పథము సాగె
3పయ్యెద తొలగంగ పలుమారు సరిజేసి
నీరుతా ముంచెనో నీలవేణి
4కులుకులొ లుకసాగు కుంజర మైతాను
అడుగులు కదిపెనో హంస గమన

వెల్లి విరిలిన జాబిల్లి వెలుగు లమర
సాగు పోచుండె దారిలో మగువ తాను
కాలమునకేల గుట్టెనో గన్ను దోయి
కాలి లోతులో దిగెనోయి కంటకమ్ము