Thursday, December 15, 2016

నిచ్చెన

తల్లి ఒడిలోని తలిరాకు బిడ్డను
ముద్దులాడి మురిసిపోక
తన వేలిని ఊతంగా
లేవదీసి
నిలువగలననే భరోసా నిచ్చీ
బుడి బుడి అడుగులతో
నడకలు నేర్పే బాధ్యత నాన్న

నీలోని యెదుగుదలకు
తాను మెట్లుగా నిలిచి
నిరంతరం వెన్నంటి ఉంటూ
నీవడిగిన ప్రతీది అందించే
గాంభీర్యం మాటున
 దాగిన ప్రేమే నాన్న

అనుభవాలు పాఠాలుగ అందించి
అనునిత్యం ఆదర్శం నిలిచి
కఠినంగా కనిపించే
మందలిం వెనుక మార్ధవం నాన్న

మనిషిని మహాత్ముడిని చేసి
సమాజానికందించుటకు
అను నిత్యం శ్రమిస్తూ
ఓపికగా నిలిచే సహనమూర్తి నాన్న

బొమ్మను బ్రహ్మగ మల్చిన శిల్పి నాన్న
అమ్మకు బ్రహ్మకు నడుమ నిచ్చెన నాన్న
                     -పచ్చిమట్ల రాజశేఖర్


No comments: