Tuesday, September 6, 2022

గురుస్తుతి పద్యం

 సీసం॥

ఉంగవుంగాయంటు ఊకొట్టి పాడంగ

ఆనంద మందేటి అమ్మ గురువు


వేలుబట్టినడిపి వెన్నెమ్ము కైనిల్చి

నడకనేర్పెడువేళ నాన్న గురువు


ఆటపాటల తోడ పాటముల్ నేర్వంగ

అండయై తానిల్చు అన్న గురువు


బడిలోని పాఠముల్ బలిమితో సదువంగ

ఆటవిడుపుజూపు యక్క గురువు

ఆ.వె.

పలకబలపమిచ్చి పాఠశాలనుజేర్చి

పెరిమ తోడ నేర్పు పెద్దగురువు

అట్టిగురుల పదము లానందముగతాకి

శిరము వంచి మ్రొక్కె శిష్యగణము

No comments: