Tuesday, December 20, 2016

పు(తి)రోగమనం

జీవారణ్యంంలో
మనిషి పశువుగా నున్నపుడు
ప్రతిప్రాణిలో దైైవత్వంం
ప్రకృృతంంతా పచ్చదనంం
సకల జీవుల సాహచర్యంం
సుఖజీవన సుంందర దృృశ్యంం
సకల చరాచర జీవుల
సమిష్టి జీవన సౌౌంందర్యంం  !

పశువు మనిషిగ పరిణమింంచి
మేథస్సుకు పదునుపెట్టి
భోగలాలస పరుంండైై
ఆనంందపు జీవనపుటలలపైై ఓలలాడుతూ
రాజీపడని రాజసంంతో
వెన్నుచూపని వీరులయి
స్వార్థ పరతయే పరమావధిగా
సకల జీవుల నెలవులయిన
వనాలు నరికి భవనాలు నిర్మింంచి
అభివృధ్ధి అదియేనని
ఆనందపడుతుండు
ఆధునిక మనిషి  !

చెరువుల కుంంటల చెర విడిపింంచి
ఆయకట్టులను ఆక్రమింంచి
కాలుష్యపు కార్ఖానాలు
ఆకాశ హర్మ్యాలు నిర్మింంచి
తన మేథస్సుకు సాటిలేదని
మురిసిపోతుండు మూర్ఖపు మనిషి !

నీటి నిలువలకాధారమైై
నిజమైైన ప్రకృృతి భాంండాగారమైై
జగతికంండగ నిలిచే కొంండల
యంంత్రపు శక్తితో ఆసాంంతంం పేల్చి
నీటినిలువలు పాతరవేసి
కోటీశ్వరులయి కులికే మనిషి
అమూల్యమైైన అమృృతదారకు
ప్రాణవాయువు మూల్యమునెరుగక
మూర్ఖపు ఆలోచనతో ముంందడుగేస్తూ
ప్రకృృతిని పాతరవేసే
అభివృృధ్ధికి అర్థమేమి
నేలవిడిచి సాము చేసి
నిలువలేమని యెరుగక
తను కూర్చున్న తరువు కొమ్మను
తనే తెగ నరుక్కుంటూ
కరువుకాటకాలన్నింటికి
కారణం తానని గుర్తించని
అమాయకత్వమే పురోగమనమా
పురోగమనంం తిలోదలకాలిస్తూ
చేసే తిరోగమన ప్రయత్నమే !

                 -పచ్చిమట్ల రాజశేఖర్
                  తెలుగు లెక్చరర్


Sunday, December 18, 2016

ఆకాశమంతెత్తు నాన్న

జీవం పోసింది అమ్మే అయినా
జీవితాన్నిచ్చేది నాన్నే
చిన్ననాటి నీ తప్పటడుగులు
తప్పుటడుగులవకుండా
ఊతమిచ్చి ఉరకలు నేర్పేది నాన్నే !
నడక నేర్చిన బాల్యాన్ని
విడిచి పెట్టకుండా ఒడిసి పట్టుకొని
నిత్యం నీ వెన్నంటి ఉంటూ
నడత నేర్పి నడిపించేది నాన్నే !

ఆలుబిడ్డల పోషణార్థమై
అనుదినం శ్రమిస్తూ
తాను నిలువునా స్రవిస్తూ
అందరికీ వెలుగులు పంచేది నాన్నే !

పరివారపు ప్రగతికైై పరితపిస్తూ
కష్టాలకడలి మథించి
మధుర ఫలాలు మనకందించే
నిస్వార్థ నిరాడంబరుడు  నాన్నే !

హనుమంతుని వంటి
అందమైన మూర్తిని
జగత్ దర్శనానికి  నిలిపే
అగుపించని ఆలంబనా శిల నాన్నే !

బాధలన్ని దిగమింగుతూ
కన్నీటిని స్వేదంగా కష్టిస్తూ
అందరినీ అందళమెక్కించి
అథఃపాతాళానికి కూరుకుపోయిన
అవిరల శ్రామికుడు ఆదర్శమూర్తి  నాన్నే !

ఇంతింతైై యెదిగిన నీవు
మొలిచిన రెక్కలతో వలసవోయి
నీకైై నీవు నిర్మించుకున్న
సుందర ఆకాశ హర్మ్యాలకు
పునాది రాయి  నాన్నే  !

తానుచేరని తీరాలను 
దాటుతున్న నిన్నుచూసి
అంతులేని ఆనందంతో గంతులేసేది నాన్న!

గగనపథాన పతంగివైై విహరిస్తూ
అలసిసొలసి ఆదమరచి
అంచలంచలుగ దిగజారుతు
పతనమవుతున్న నిన్ను
తన చేతి దారంతో చైైతన్యపరిచి
ఎగురుతున్న నీ ఉన్నతిని చూసి
మురిసిపోతూ మైమరచిపోయేది నాన్నే !

నాన్నంటే ప్రేమ !
నాన్నంటే నమ్మకం !
నాన్నంటే ఆదర్శం !
నాన్నంటే ఆత్మీయ స్పర్శ !
  కొంండంత అంండ   !

నాన్ననే పిలుపు అమోఘం
                అనిర్వచనీయం
            ఆకాశమంత ఎత్తు !
                                     
                      - పచ్చిమట్ల రాజశేఖర్









Saturday, December 17, 2016

వీడుకోలు

నేస్తమా!         ఓ నేస్తమా !
ఈ సుదీర్ఘ జీవనయానంంలో
ప్రతి కలయికా ఓ వీడ్కోలుకు నాంంది
ప్రతి వీడ్కోలూ ఓ కలయికకు పునాది
అల్లరి చేష్టలతో ఆహ్లాదంంగా
గడిపిన పాఠశాల పరిసరాలను
పసితనపు పసిడి నేస్తాలను
వీడిపోతున్నంందుకు విచారింంచకు
నీలో విరిసిన స్నేహ పరిమళాలు
పరిఢవిస్తున్నంందుకు సంంతోషింంచు
అజ్ఞానపు అంందకారంంలో
జ్ఞానజ్యోతి వెలిగింంచిన
గురువుల మాటలను
గుంండెల్లోతుల్లో నిలుపుకొని
సువిశాల సుడిగుంండపు
సుంందర ప్రపంంచంంలోని
చిక్కులన్నింంటిని సక్కజేసి
సుకమయ జీవితాన్ని సాగింంచు
సుస్తిర లక్షాన్ని స్తాపింంచు
అరుదైైన అపురూప బాల్యంంలో
స్నేహంం మిగిల్చిన తీయని
 అనుభవాలను నెమరేసుకుంంటూ
ఆశయ సాధనకైై అడుగులు వేస్తూ
ఆనంందంంగా సాగిపో
ఈ వీడ్కొలును వేడుకోలుగ
అనునిత్యంం మలుచుకో
అంంచలంంచలుగ యెదుగుతూ
ఆనంందంంగా సాగిపో . . !

                     -పచ్చిమట్ల రాజశేఖర్

Friday, December 16, 2016

మలయమారుతంం

సృృష్టిలోని బంందాల్లో
సుంందరమైైనది స్నేహంం
పచ్చని ప్రకృృతి లో
నులి వెచ్చని పరిమళంం స్నేహంం
మంండుటెంండలో
మలయమారుతంం స్నేహంం
ఎడారి పయనంంలో
ఎదురైైన ఒయాసిస్సు స్నేహంం
సుదీర్ఝ జీవన యానంంలో
సుస్తిర సుమధుర స్పర్శ స్నేహంం
అలసిన యెదల
వ్యధల ఆవిష్కరణ రూపంం స్నేహంం
అంందరినీ బంంధింంచే
ఆత్మీయాలింంగనంం స్నేహంం
అరుదైైన.....
అసలైైన బంంధంం స్నేహంం

                - పచ్చిమట్ల రాజశేఖర్

Thursday, December 15, 2016

నిచ్చెన

తల్లి ఒడిలోని తలిరాకు బిడ్డను
ముద్దులాడి మురిసిపోక
తన వేలిని ఊతంగా
లేవదీసి
నిలువగలననే భరోసా నిచ్చీ
బుడి బుడి అడుగులతో
నడకలు నేర్పే బాధ్యత నాన్న

నీలోని యెదుగుదలకు
తాను మెట్లుగా నిలిచి
నిరంతరం వెన్నంటి ఉంటూ
నీవడిగిన ప్రతీది అందించే
గాంభీర్యం మాటున
 దాగిన ప్రేమే నాన్న

అనుభవాలు పాఠాలుగ అందించి
అనునిత్యం ఆదర్శం నిలిచి
కఠినంగా కనిపించే
మందలిం వెనుక మార్ధవం నాన్న

మనిషిని మహాత్ముడిని చేసి
సమాజానికందించుటకు
అను నిత్యం శ్రమిస్తూ
ఓపికగా నిలిచే సహనమూర్తి నాన్న

బొమ్మను బ్రహ్మగ మల్చిన శిల్పి నాన్న
అమ్మకు బ్రహ్మకు నడుమ నిచ్చెన నాన్న
                     -పచ్చిమట్ల రాజశేఖర్


Wednesday, December 14, 2016

మరల రానిది

నీటిలోని అలలైై
నిరంంతరంం కదలాడుతూ
నింంగిలోని తారలైై
మిణుగురులైై తళుకులీనుతూ
అనునిత్యంం ఆనంందోత్సాహంంతో
హాయిగా నవ్వుకునే
నిష్కాపట్యపుహృృదయంం
నిర్మల జీవన మచ్చుతునక బాల్యంం

నిరంంతర చేష్టలతో
నిరాటంంకపు ఆటపాటలతో
అంందరికి హాయిని పంంచే
ఆ బాల్యంం అపురూపంం

పొద్దువొడిసినప్పటినుంంచి
పొద్దుగూకేదాక
అలుపెరుగక ఆటలాడి
సేదబాయికాడ జేరి
బుడ బుడ తానంంజేసి
బువ్వ దిని
ఆదమరచి హాయిగ నిద్రింంచే
ఆ బాల్యంం అమోఘంం

తోటివారితోని తోబుట్టువులతోని
ఆటపాటల మాటున
ఆలోచనలకు పదునుపెట్టి
అంంతర్గత కౌౌశలాల
నప్రయత్నంంగ వెలికి తీసి
భావి జీవితానికి బాటలు వేసిన
ఆ బాల్యంం అనిర్వచనీయంం

దాగుడు మూతలలోన దాగిన వెతుకులాట
గురిజూసి గోటిని కొట్టడంంలోని ఏకాగ్రత
చింంతచెట్టు కింంద చిర్రగోనె జోకుడు
చిన్న చిన్న కొమ్మలెక్కి కోతికొమ్మ లాడుడు
మోటబాయిల మునిగి కోడిపుంంజు లాడుడు
చిన్న చిన్న ఆటలల్ల చిత్రమైైన కౌౌశలాలు
ఏగురువు నేర్పలేనివి!
ఎన్నటికీ మరువలేనివి!

అవ్వ నెడబాసిన ప్పటి నుంండి
అన్న చేయివట్టి బడికోయె దాక
సోపతిగాల్లతోని
అల్లరిఅరుపుల ఝరులైై
చిరునవ్వుల నెలవులైై
ఆనంందానికి ఆలవాలమైై
అమృృతానుభూతులు నింంపిన
ఆనాటి ఆ బాల్యంం
         మరువలేనిది
         మరల రానిది

               

సన్నజాజి

Wednesday, December 14, 2016
మరల రానిది
నీటిలోని అలలైై
నిరంంతరం కదలాడుతూ
నింంగిలోని తారలైై
మిణుగురులైై తళుకులీనుతూ
అనునిత్యం ఆనంందోత్సాహంతో
హాయిగా నవ్వుకునే
నిష్కాపట్యపుహృదయం
నిర్మల జీవన మచ్చుతునక బాల్యం!

నిరంంతర చేష్టలతో
నిరాటంకపు ఆటపాటలతో
అంందరికి హాయిని పంచే
ఆ బాల్యంం అపురూపం!

పొద్దువొడిసినప్పటినుంచి
పొద్దుగూకేదాక
అలుపెరుగక ఆటలాడి
సాదబాయిమీద బొక్కెన్లానీళ్లుజేది
బుడ బుడ తానంజేసి
బువ్వ దిని
ఆదమరచి హాయిగ నిద్రించే
ఆ బాల్యం అమోఘం!

తోటివారితోని తోబుట్టువులతోని
ఆటపాటల మాటున
ఆలోచనలకు పదునుపెట్టి
అంంతర్గత కౌశలాల
నప్రయత్నంగ వెలికి తీసి
భావి జీవితానికి బాటలు వేసిన
ఆ బాల్యం అనిర్వచనీయం!

దాగుడు మూతలలో దాగిన వెతుకులాట
గురిజూసి గోటిని కొట్టడంలోని ఏకాగ్రత
చింతచెట్టు కింద చిర్రగోనె జోకుడు
చిన్న చిన్న కొమ్మలెక్కి కోతికొమ్మ లాడుడు
మోటబాయిల మునిగి కోడిపుంజు లాడుడు
చిన్న చిన్న ఆటలల్ల చిత్రమైైన కౌశలాలు
ఏగురువు నేర్పలేనివి!
ఎన్నటికీ మరువలేనివి!

అవ్వ నెడబాసిన ప్పటి నుండి
అన్న చేయివట్టి బడికోయె దాక
సోపతిగాల్లతోని
అల్లరిఅరుపుల ఝరులైై
చిరునవ్వుల నెలవులైై
ఆనంందానికి ఆలవాలమై
అమృతానుభూతులు నింపిన
ఆనాటి ఆ బాల్యం
         మరువలేనిది
         మరల రానిది

               
రాజశేఖర్ at 10:09 PM

Tuesday, December 6, 2016

నీ లోని నేను

అనునిత్యంం నీ జ్ఞాపకాల
అలలపైై ఓలలాడుతుంంటాను
నీలోని ప్రశాంంతతను
నింండార వీక్షిస్తూ నిరీక్షిస్తుంంటాను
        నదిలా హొయలొలుకుతూ
        నింంపాదిగా సాగే నీ గమనానికి
       అడ్డుపడిన గుంండునయి నిలిచి
      నీలోని గలగలలు వెలికి తీస్తుంంటాను
మౌౌనాలంంకారపు నీ వదనంంలో
చిరుదరహాసంం చిగురింంపజేస్తాను
స్నేహానికి చేయంందింంచి
ఆప్యాయతకుఆలవాలమైై
నీ ఊహలకు ఊతమిచ్చి
విహంంగమైై విహరింంప జేస్తాను