ఎక్కడిదీ స్వాతంత్ర్యం ఎవ్వరికీ స్వాతంత్ర్యం
ఉన్నోడికా లేనోడిక మనుషులనే అందరికా
యుగాలెన్ని మారినా బతుకుతీరు మారలే
తరాలెన్ని పోయినా తలరాతలు మారలే
దాస్యమింక తొలగలేదు బతుకుపోరు తప్పలేదు
ఐనాయెందుకు యీ స్వాతంత్ర్య సంబరాలు ఎక్కడిదీ
మనిషి జాతిపుట్టుకకూ స్త్రీమూర్తే మూలమైన
ఆడబిడ్డ పుట్టుకకూ ఆటంకమె యడుగడుగున
అంగడిలో పశువులుగ అమ్మఘయుట వీడలేదు
ఐనా. ఐనా
ఐనాయెందుకు మనకీ స్వాతంత్ర్య సంబరాలు ఎక్కడిదీ
ఆలనపాలన లేని అనాథలుగ ధీనత్వం
ఆడుకునే వయసులోనె పనితప్పని హీనత్వం
మెతుకులేక బడిలేక ఒంటరిగా బతుకలేక
వెట్టిఊబిలోకి నెట్టె రాక్షసత్వంమీడలేదు
ఐనా. ఐనా
ఐనాయెందుకు మనకీ స్వాతంత్ర్య సంబరాలు ఎక్కడిదీ
పెన్నుపట్టు యువతనేడు గన్నుపట్టి కదులుతోంది
మానవతా జాడలలో మతతత్వం రేగుతోంది
రాచరికపు అరాచకమె అణువణువున జ్వలిస్తోంది
ఐనా. ఐనా
ఐనాయెందుకు మనకీ స్వాతంత్ర్య సంబరాలు ఎక్కడిదీ
No comments:
Post a Comment