Wednesday, October 19, 2022

అన్నయననేమి (పద్యాలు)

 సీసం1:

అన్నయనగనేమి వయసుభేదముగాదు

పెద్దయగునుతాను బుద్దితోడ

అన్నయనగనేమి వయసుభేదముగాదు

తనపరమ్మెరుగని తన్మయతన

అన్నయనగనేమి వయసుభేదముగాదు

చెలగిపం చెడునట్టి చింతతోడ

అన్నయనగనేమి వయసుభేదముగాదు

తానుదినకబెట్టు తపన తోడ

ముందుబుట్టినంత ముద్దుసేసినయంత

అన్నలవ్వబోరు అగ్రజుండు

అన్నయౌను తాను ఆత్మీయతలతోడ

పెద్దబుద్దితోడ పెరిమతోడ


సీసం2:

అన్నయవ్వునుతాను అమ్మలేనవ్వేళ

లాలనమ్మునుజేసి లాలబోసి

అన్నయవ్వునుతాను నాన్నలేనవ్వేళ

పొద్దుమాపుందాక పోషియించి

అన్నయవ్వునుతాను ఆహార్యమెరుగక

ముడ్డిగుడ్డల్లేక ముద్దుసేసి

అన్నయవ్వునుతాను ఆడంబరములేక

ఆటలాడుచుతాను ఆదమరిచి

అన్నతానవుతడు ఆలపాలనమున

యగ్రజుండు గాదు అన్నయనగ

అన్నతానవుతడు తనయాకలిమర్చి

పెరిమతోడముద్ద పెట్టువాడు

Monday, October 3, 2022

విష్ణుమూర్తి కొయ్యరూపం పై పద్యం

 (ఉత్కళ దేశపు కొయ్యరూప జగన్నాథునిపై  సీసపద్యం)

సీసం:

ఒకభార్య ప్రకృతిమరొకభార్య చంచలా

ఒక్కటి తిరముమ రొక్కచరము

తనయుండు మన్మథు తలపునదొరకడు

అశరీరి యైజను లందరి బాధించు

తనుబడలికబాప తల్పమొం దుదమన్న

పడగవేలుగలిగి పడక గాదు

గరుడవాహనమెక్కి గమియించెదమన్న

పాముల గనితాను వాలుపుఢమి


ఇన్ని బాధలు తలచియా విష్ణుమూర్తి

సకల సంపద లుండినా వికలమొంది

వివిధ రూపము లన్నిటి విడిచిపెట్టి

కొయ్య బారెను గదవిష్ణు కోరిజగతి

మాట విలువ (కందం)

 మాటే బంధము లుగలుపు

మాటే తెంచును చెలిమిని మనుషుల నడుమన్

మాటే ప్రాణము నిలుపును

మాటే రందులు జెరచును మనముల నెడలన్

Sunday, October 2, 2022

వాణీ స్తుతి

 వాణీ!పుస్తకపాణీ

వాణీ!తేనియపలుకుల వాసిని దేవీ!

వాణీ!మధురోక్తనిలయి

వాణీ!నాకొసగుమమ్మ వాక్కుల వరుసల్