Tuesday, June 1, 2021

ప్రకృతి పరాసికం (పరిహాసికం)

 

విహాయాసంలో విహరించే

తెలిమేఘమా

దరిచేరక దోబూచులాడే చెలిదేహమా

వాయుసారథ్యంలో ఒయ్యారంగా నీవు

సామజపు నడుమొంపులతో తనూ

దూరంగా ముగ్ధసౌందర్యరాశివైన

నిన్నుజూసి

ఆత్రంగా అందుకునేలోపు 

ఆకారశూన్యమై అనంతమై వ్యాపిస్తావు

చెలి మనసులోతుల్లో దాచుకున్న ప్రేమవై

అంతా భ్రమని 

నన్నునేను నచ్చజెప్పుకొని

పైకిచూస్తే

చెంతచేరువై దాపునిల్చి

పట్టుకోమని పరాసికమాడుతావు

మేఘమా! 

నీవు నా వెన్నెల వన్నెలచెలితీరే

No comments: