Thursday, December 13, 2007

దయార్ద్ర హృదయుడు

అంట రాని వాడంటు
అడ్డు గోడ బెట్టకు
అంతులేని విలువ గల్గి
నీకంద రాని వానిని.

రంగు మెరుగు రాళ్ళ
నెరిగిన నీవు
వాటి జన్మ తలాలైన
మూలాలను యెంచలేవు.

సృస్టి కర్త తనువు నుంచి
చించుకుంటు మీరస్తే
పరుల మేలు గోరు
నేను పాదాలను యెంచుకుంటి.

మీరు చించిన దేహం
నేల రాలి పోకుండా
పాదాలలో ప్రవేసించి
పటిష్టంగ నిలబెట్టితి.

అర్థ విలువ లధికమయ్యి
ఆప్యాయత లెరుగలేవు
మమత లెరుగని నీవు
మనిషివి గానేరవు.

ఱెక్కలొచ్చిన మీరు
దిక్కులకై యెగురుతుంటె
జన్మ నిచ్చిన తల్లి
ఋణం తీర్చ నేనుంటి.

అంటరాని వాన్ని గాను
అనురాగం గల్గి నోన్ని
దలితుడిని గాను
నేనుదయార్ద్ర హృదయుడిని.

5 comments:

రాధిక said...

very touching one

ఏకాంతపు దిలీప్ said...

సున్నితంగ ఉంది... ఎవరో ఎప్పుడో నిర్వచించిన వ్యవస్థని అంగీకరిస్తూనే, దానిలొనే తన ఉనికిని,అస్తిత్వాన్ని మెత్తగా చాటి చెప్పడానికి ప్రయత్నించడంలో వాస్తవ పరిస్థితులకి ఎదురు నిలిచే అంతులేని ధైర్యం కనపడుతుంది...

Unknown said...

మీ బ్లాగు బాగుందండి.

దీనిని జల్లెడకు కలిపాము.


www.jalleda.com

జల్లెడ

రాజశేఖర్ said...

thank u jalaiah garu iam trying to stand in that jalleda ok thank u very much

రాజశేఖర్ said...

thank u jalaiah garu iam trying to stand in that jalleda ok thank u very much