Monday, February 13, 2023

గజల్ ఖండగతి (నిరక్షరాస్యత నిర్మూలన)

 వాగ్దేవి సాహితీవేదిక

పచ్చిమట్ల రాజశేఖర్ 

గోపులాపూర్ జగిత్యాల

9676666353


గజల్ ఖండగతి 

(నిరక్షరాస్యత నిర్మూలన)



సుబోధపు విజ్ఞానము వికసనమె చదువంటె

పరిశుద్ద ఆత్మలా వికసనమె  చదువంటె


నిన్నంటు వదిలేసి మిన్నుంటు చూపేల

మన్నుపయి  మనవునికి నిలుపుదలె చదువంటె


చుట్టున్న ఛీత్కార తెరదాటి విరబూసి

బురదలో తామరల నిర్మలమె చదువంటె


అడుగడుగు అజ్ఞానపు అలలెన్నొ పోటెత్తి

విహాయస నింగికై పయనించుటె చదువంటె


నిరక్షర నిశీధులె రాజసము నడిగింప

మిణుగురై జడత్వము మాన్పుటే చదువంటె

No comments: