Friday, November 8, 2019

సమస్య: రతిమూలము సర్వధర్మ రక్షణ కొరకై



పతిలే నిసతులు జేసెడు
వ్రతత్యాగము ఫలమునీక వ్యర్థమ్మెయగున్
సతిపతు లిర్వురి త్యాగని
రతిమూలము సర్వధర్మ రక్షణ కొరకై


సతతము ధర్మాచరణము
గతితప్పకజేయువారు ఘనులే యగుదుర్
మతులగు జనుల త్యాగని
రతి మూలము సర్వ ధర్మరక్షణ కొరకై

1 comment:

రాధేశ్యామ్ రుద్రావఝల said...

బాగున్నాయండి మీ పూరణలు..!
రెండవ పద్యంలో గతితప్పక చేయువారు ఘనులే యగుదురు అని మీ భావమా? లేక దుర్మతులగు జనుల త్యాగనిరతి మూలము.... అనా?
రెండవది అంత అర్థవంతంగా అనిపించలేదు.
ఒకవేళ మొదటి అర్థమే మీ భావమైతే యగుదుర్ అనేది అసాధువండి..!
మూడవ పాదంలో 'జనుల త్యాగని' లో 'ల'లఘువే అవుతుంది కదా..! అప్పుడు గణ భంగం అవుతోంది. గమనింపగలరు.