Wednesday, May 2, 2007

ఆ:వె:
తెలుగు శాఖయనెడి దివ్య మందిరమున
అష్టదిగ్గజములె మాగురువులు
నాటి రాయల సభ తలపింపుచూ నేడు
వెలుగు జిమ్ముచుండె వీడుకోలు

తే:
దిగులు పడకు ధీరుడ నేడు ధీనుడయితి
నని నిలిచెదవు మున్ముందు నింగి నంటి
నివురు గప్పిన గానదు నిప్పు రవ్వ
ప్రజ్వలించి పెన్మంటలు రాకపోవు