Saturday, August 11, 2018

సమస్యాపూరణం:

సమస్యాపూరణం:
జలపు ష్పములగ నినంత జలజభ యపడెన్

కం.చెలికా నిచేయు బట్టుక
      వలపుల క్రీడల కుచెలియ వడివడి కదులన్
      జలము న్నచెరువు నందలి
      జలపు ష్పములగ నినంత జలజభ యపడెన్

పంది యిష్టపడును పద్యములను

అందమైన తెలుగు పద్యమరచిచూడ
సుంద రంపు భావ సుస్థిరమ్ము
తెలుగు భాష సొగసు తెలుసుకొ నగనెంచి
పంది యిష్టపడును పద్యములను

Wednesday, August 8, 2018

గజల్ స్నేహపరిమళం



అందమైన బంధమై అవతరించెరా చెలిమి
అవరోధాలెరుగకుండ అంకురించురా చెలిమి ॥2॥

పేద ధనిక భేదాలను యెంచబోదురా ॥2॥
సిరిసంపద తూచనిదీ స్వచ్ఛమైన చెలిమిరా

కులమతాలపట్టింపుల నెలవుగానిదీ॥2॥
మంచిమనసుతో మనుషుల గెలుచు చెలిమిరా

కలిమి బలిమి లవి
చెలిమిని నిలువరించవూ॥2॥
రంగురూపుచూడని యనురాగమే చెలిమిరా

సకల సంపదలు మించు స్వర్గమే స్నేహమనీ
కవిశేఖరు కలలుగన్న బలము చెలిమి రా

Monday, August 6, 2018

గజల్ స్నేహపరిమళం

గజల్   స్నేహపరిమళం

అందమైన బంధమై అవతరించెరా చెలిమి
అంంతస్తులనెరుగకుండ అంకురించురా చెలిమి ॥2॥

పేద ధనిక భేదాలను యెంచబోదురా ॥2॥
సిరిసంపద తూచనిదీ స్వచ్ఛమైన చెలిమిరా

కులమతాలపట్టింపుల నెలవుగానిదీ॥2॥
మంచిమనసుతో జగతిని గెలుచు చెలిమిరా

కలిమి బలిమి లవి
చెలిమిని నిలువరించవూ
రంగురూపు లవి చెలిమికి రక్తినీయవూ ॥2॥
సకల సంపదలు మించు స్వర్గమే స్నేహమనీ
కవిశేఖరు గుర్తించిన బలము చెలిమి రా 



Sunday, August 5, 2018

చెలిమి ఫలం

దుష్ట మైత్రి వలన దుర్గతు లుకలుగు
మైత్రి తోడ మంచి  బతుకు దొరుకు
కౌరవులను గూడి కర్ణుడు చెడిపోయె
అర్జునుండు వెలిగె అచ్యు తునితొ
పచ్చిమట్లమాట పసిడిమూట

Saturday, August 4, 2018

కార్యానుకూలత

అనుకూ లతలే నియెడల
పనుల న్నిటగా నరాదు ఫలితం   బవనీ
అనుకూ లతగలి గినెడల
పనుల న్నియుస క్కజేసి పరవశ మొందన్

బాటసారి

అడుగడుగులు కదిలి పథము సాగుటెగాని
బడలి కెరుగ బోడు బాటసారి
ఎగుడు దిగుడు త్రోవ లెన్నెదు రైనను
జంక కుండ సాగి జయము నొందు

                పచ్చిమట్ల రాజశేఖర్

Friday, August 3, 2018

హరితహారం


దండిగ తరువులు బెంచిన
మెండుగ వానలు కురియును మేదిని యందున్
నిండును చెరువులు కుంటలు
పండును తెలగా ణనేల బంగరు పంటల్