Saturday, December 29, 2018

సీసపద్య సొగసు

సీసపద్యాలను ఛీదరిం చుటగాదు
సీసమే పద్యాల శిఖర మౌను

గాన యో గ్యములైన గమకమ్ము లనుగూడి
సంగీత ఝరిలాగ సాగి పోవు

పాల్కుర్కి సోమన్న పాండిత్య మునుదెల్ప
సీసము లనుగూర్చి రాశి వోసె

సరళప దాలలో సరసభా వమునిల్పి
సెలయేటి పరవళ్ల సేర దీసి

శ్రీనాథ కవిరాజు శ్రీపతు లొప్పేల
సీసము లనురాసి సిరుల నొందె

పద్య మందు మిగుల హృద్యమౌ సీసమ్ము
నవర సభరి తమయి నాట్య మాడె
పండి తులనె గాదు పామరు లునుమెచ్చె
సీస పద్య మిలలొ వాసి కెక్కె

Saturday, December 8, 2018



సత్వ మొంది నంత సకలసి ద్ధిగలుగు
బలము గలిగి నంత ఫలము గల్గు
మనిషి సత్వ ముడుగ మాటజె ల్లుటకల్ల
ప్రాకు లాట వలదు ప్రాణి కోటి
పచ్చిమట్లమాట పసిడిమూట

అసలు నిజము

సీసం.
కొడుకుగు ణమ్మది కోడలొ చ్చినదెల్యు
ప్రాయమొ చ్చినదెల్యు పాప గుణము

భార్యరో గియయిన భర్తగు ణముదెల్యు
కలిమిలే కదెలియు కాంత గుణము

జగడమం దునదెల్యు అన్నద మ్ముగుణము
నిరతక ష్టమ్మున  నేస్త గుణము

ప్రాయమం దుమిగుల ప్రాకులా డినగాని
చావుద శలదెల్యు సంతు గుణము

కడుపుతీ పినిమించి కటికచే దిలలేదు
బంధుప్రీ తి కన్న భ్రాంతి లేదు
సమయ మొచ్చినంత సకలబో ధయుగల్గు
వగువ వలదు జనులు వార్త దెలిసి


Friday, December 7, 2018

కత్తి - కలము

కత్తి వట్టి నోరు కత్తివాటుకుబోవు
కలము వట్టి నోరు ఘనత జెందు
కత్తి దార కన్న కలము దా రనెమిన్న
పచ్చిమట్లమాట పసిడిమూట