Thursday, October 18, 2018

గజల్

ఎగిసిపడే అలలెప్పుడు అలిసిపోవులే
ఎగబాకే రవిబింబం అలిసిపోదులే

చిట్టిచిట్టి పాదాలతో దూరాలను దాటుకుంటూ
బారులుతీరే చీమలు అలసిపోవులే

పాలనపేరుతొ ప్రజలను వంచించినట్టి
దోపిడిదారులెప్పుడు అలసిపోరులే

సమాజరుగ్మతలను బాపి సమసమాజ స్థాపనకై
అహర్నిశలు శ్రమియించే సంస్కర్తలు అలసిపోరులే

సమాజంలొ తానుంటూ సర్వస్వము దోచుకుంటూ
అంచెలంచెలుగ యెదిగే పాలకవర్గం యెప్పుడు అలసిపోరులే

దేశప్రజల భవితకొరకు సాహిత్యము సృజియించే
కవిశేఖరు కలమెప్పుడు అలసిపోదులే

No comments: